మావోయిస్టులకు సహకరించవద్దు 

Do not cooperate with Maoists– ఎస్ ఐ ఏ కమలాకర్ పసర పోలీస్ స్టేషన్
నవతెలంగాణ – గోవిందరావుపేట
ఎట్టి పరిస్థితుల్లో తీవ్రవాదులైన మావోయిస్టులకు సహకరించవద్దని పసర పోలీస్ స్టేషన్ ఎస్ఐ ఏ కమలాకర్ అన్నారు. సోమవారం మండలంలోని పసర పోలీస్ స్టేషన్ పరిధిలో గల కోడిసెలకుంట గుత్తి గూడెం ను సిబ్బందితో కలిసి ఎస్సై కమలాకర్ సందర్శించారు. ఈ సందర్భంగా ఎస్ఐ కమలాకర్ గూడెం ప్రజలతో మాట్లాడుతూ కొత్త వ్యక్తులు ఎవరైనా వస్తే వెంటనే పోలీస్ స్టేషన్కు సమాచారం అందించాలని అన్నారు. అపరిచితులకు మావోయిస్టులకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆశ్రయం కల్పించవద్దని అన్నారు. తాడువాయి గుండాల ఎదురుకాల్పుల్లో గాయపడిన నక్సలైట్లు ఇటుగా వచ్చే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని వస్తే సమాచారం ఇవ్వాలని అన్నారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే శిక్ష తప్పదని హెచ్చరించారు. గ్రామంలో ఉన్న సమస్యలను అడిగి తెలుసుకుని పరిష్కారం కోసం కృషి చేస్తానని అన్నారు.