ప్రోటోకాల్‌ సమస్యలు సృష్టించకండి

– ఇంటెలిజెన్స్‌ చీఫ్‌కు ఎమ్మెల్యే మహిపాల్‌ రెడ్డి ఫిర్యాదు
నవతెలంగాణ-పటాన్‌చెరు
ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు మారడం సహజమని, రాజ్యాంగబద్ధంగా కల్పించిన ప్రోటోకాల్‌ హక్కును సైతం ఉల్లంఘిస్తూ ఎలాంటి రాజ్యాంగ పదవులు లేని అధికార పార్టీ నాయకులు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటు న్నారని, దీని మూలంగా రాజకీయ సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉందని రాష్ట్ర ఇంటెలిజెన్స్‌ చీఫ్‌కు పటాన్‌చెరు ఎమ్మెల్యే మహిపాల్‌ రెడ్డి ఫిర్యాదు చేశారు. నర్సాపూర్‌ శాసనసభ్యురాలు సునీత లక్ష్మారెడ్డి, దుబ్బాక శాసనసభ్యులు కొత్త ప్రభాకర్‌ రెడ్డి, జహీరాబాద్‌ శాసనసభ్యులు మాణిక్‌ రావులతో కలిసి రాష్ట్ర ఇంటలిజెన్స్‌ చీఫ్‌ శివధర్‌ రెడ్డికి మంగళవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వివిధ అంశాలను ఆయన డిజిపి దృష్టికి తీసుకువచ్చారు. అధికారిక కార్యక్రమాల పర్యటనలో పోలీస్‌ ఎస్కార్ట్‌ను తొల గించడం, అధికార పార్టీ నుండి పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థి ప్రభుత్వ అధికారిక సమావేశాల్లో ప్రోటోకాల్‌ కు విరు ద్ధంగా పాల్గొనడం, తదితర చర్యల మూలంగా నియోజ కవర్గంలో శాంతిభద్రతల సమస్య ఉత్పన్నమయ్యే అవకాశం ఉందని ఫిర్యాదు చేశారు. వెంటనే పై అంశాలపై క్షేత్రస ా్థయిలో విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని కోరారు.