పుచ్చకాయ గింజలు అస్సలు పడేయకండి

పుచ్చకాయ గింజలు అస్సలు పడేయకండిపుచ్చకాయ గింజల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. వీటిలో కేలరీలు చాలా తక్కువ. మరోవైపు, శరీరానికి అవసరమైన రాగి, జింక్‌, పొటాషియం, మెగ్నీషియం , ఐరన్‌ వంటి ఖనిజాలు, పోషకాలు ఉన్నాయి. దీంతో శరీరంలో రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది.
అధిక స్థాయి మెగ్నీషియం రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది. గుండె ఆరోగ్యం కూడా కాపాడబడుతుంది.
దీని ఖనిజ పోషక శక్తి ఎముకలను కూడా బలపరుస్తుంది. శరీర పెరుగుదల, మార్పులనూ నియంత్రిస్తుంది. మధుమేహం ఉన్నవారికి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది.
పుచ్చకాయ గింజలను ఎండబెట్టి ఫ్రై చేసుకొని తినవచ్చు . పుచ్చకాయ గింజలతో బర్పీలను తయారు చేయవచ్చు. బెల్లం వేసి లడ్డూలూ చేసుకోవచ్చు.
పుచ్చకాయ గింజల షేక్‌, పుచ్చకాయ సీడ్‌ వెన్న తయారు చేయవచ్చు.
పుచ్చకాయ గింజలు ఆరోగ్యాన్ని కాపాడడమే కాదు.. చర్మాన్ని సంరక్షిస్తుంది. ఇది జుట్టు ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది. పుచ్చకాయ గింజల నూనె అమ్ముతారు. దీన్ని చర్మంపై రుద్ది మసాజ్‌ చేసుకోవచ్చు. దీన్ని తల మూలాల్లో రుద్దితే జుట్టు పెరుగుతుంది. ఎన్నో ఉపయోగాలున్న పుచ్చగింజలను మన రెగ్యులర్‌ ఆహారంలో చేర్చుకోవటం ద్వారా ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకుందాం.