
నవతెలంగాణ – కామారెడ్డి : కామారెడ్డి పట్టణంలో మై ఆటో మై సేఫ్ అనే అంశంపై ఆటో డ్రైవర్లకు కామారెడ్డి డి.ఎస్.పి నాగేశ్వరరావు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. డ్రైవర్లను దేశించి ఆయన మాట్లాడుతూ ఆటో డ్రైవర్లకు పలు సూచనలు చేస్తూ, మీరు ఒకరు బాగుంటేనే మీ ఇల్లు అంతా బాగుంటుందని మీకు జరగరాని రెండు విషయమేదైనా జరిగితే మీ కుటుంబం రోడ్డు పాలవుతుందని అందుకోసం తగిన జాగ్రత్త తీసుకొని ఆటోలను నడిపించాలన్నారు. ఆటోకు ఉండాల్సిన కాగితాలు, డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్, మద్యం సేవించి వాహనం నడపకుండా ఉండడము, మొదలగు వాటిపై సూచనలు అందజేశారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి పట్టణ సీఐ, ఎస్ఐలు, సిబ్బంది, సుమారుగా 120 మంది ఆటో డ్రైవర్ లు పాల్గొన్నారు.