నెంబర్‌ ప్లేట్స్‌ లేకుండా వాహనాలను నడపరాదు

నెంబర్‌ ప్లేట్స్‌ లేకుండా వాహనాలను నడపరాదు– పట్టణ సీఐ ఒరగంటి రవి
నవతెలంగాణ జమ్మికుంట
నెంబర్‌ ప్లేట్స్‌ లేకుండా వాహనాలను నడిపితే చట్టరీత్యా చర్యలు తీసుకుం టామని జమ్మికుంట పట్టణ సిఐ ఒరగంటి రవి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో నెంబర్‌ ప్లేట్స్‌ లేని వాహనాలను పట్టుకున్నారు. అలాగే త్రిబుల్‌ రైడ్‌ చేసే వారిని, మైనర్‌ డ్రైవింగ్‌ చేస్తున్న పిల్లల్ని పట్టుకొని పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. వారందరికీ అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఎస్సై వివేక్‌ ,పోలీసులు తదితరులు పాల్గొన్నారు.