పరగడుపున ఇవి తినొద్దు…

రోజూ ఉదయం మనం తీసుకొనే ఆహారం ఆరోగ్యంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు.. రోజూ మొదలయ్యే సమయంలో బలమైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం.. ఉదయాన్నే ఖాళీ కడుపుతో తినే ఆహారం మనల్ని రోజంతా ప్రభావితం చేస్తుంది.. అందుకే పరగడుపున కొన్ని ఆహారాలను అస్సలు తీసుకోవద్దని నిపుణులు నిపుణులు చెబుతున్నారు.. అవేంటో ఒకసారి చూద్దాం..
చక్కెరలు ఎక్కువగా ఉన్న ఆహారాలను తీసుకోవడం మంచిది కాదు.. కత్రిమ రుచులు, రంగులతో కూడిన ఆహారాలను తినడం మాను కోండి. వీటిని తినడం వల్ల కేలరీలు పెరుగు తాయి.. దాంతో బరువు పెరుగుతారు..ఫ్రైస్‌, నూనెలో వేయించిన ఆహారాలను అస్సలు తీసుకోవడం మంచిది కాదు.. ఎందుకంటే సరిగ్గా జీర్ణం కాదు.. దాని వల్ల జీర్ణ సమస్యలు వచ్చే అవకా శాలు, ఉదయాన్నే కత్రిమ రుచులు, స్వీటెనర్లతో కూడిన పెరుగు తినడం ఆరోగ్యానికి మంచిది కాదు.. ఇంకా ఎక్కువ ప్రాసెస్‌ చేసిన ఆహారాన్ని తీసుకోవడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు..