విద్యార్థినీలకు పాఠ్య బోధనంలో ఇబ్బందులు కలగొద్దు

నవతెలంగాణ- క్రిష్ణా 

నారాయణపేట జిల్లా క్రిష్ణా మండల పరిధిలోని హిందూపూర్ గ్రామ శివారులోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యానిలయాన్ని జిసిడివో పద్మనాలిని, ఎంఈఓ నిజముద్దీన్ సోమవారం సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా పాఠశాలలో సమగ్ర శిక్ష ఉద్యోగులు ధర్నాలో ఉన్నందున పాఠశాలలో నెలకొన్న సమస్యలు, భోజన వసతి పై విద్యార్థినీయులను అడిగి తెలుసుకున్నారు. విద్యానిలయంలో విద్యార్థినీయులకు ఏర్పాటు చేస్తున్న వంటలను, కూరగాయలను పరిశీలించి, పలు రికార్డులను తనిఖీ చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ విద్యార్థినీయులకు బోధన విషయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండగా నాన్ టీచింగ్ ఉపాధ్యాయులను ఏర్పాటు చేయడంతో పాటు విద్యార్థులకు డిజిటల్ పాటలను బోధిస్తున్నట్లు తెలిపారు, సమగ్ర శిక్ష ఉద్యోగులు తిరగ పనిలో చేరేవరకు విద్యార్థినీయులకు బోధన విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాటుతో కూడిన చర్యలను చేపట్టామని ఆమె తెలిపారు, విద్యార్థినీయులకు మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం అందించాలన్నారు. పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, విద్యార్థులు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలన్నారు. సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలలోనే నాణ్యమైన విద్య అందుతుందని అన్నారు.