వహాబ్‌ స్థాయిని మరిచి మాట్లాడకు

– కాంగ్రెస్‌ పట్టణ అధ్యక్షులు నయూం
నవతెలంగాణ-కొడంగల్‌
బీఆర్‌ఎస్‌ నాయకులు వహాబ్‌ స్థాయిని మరిచి రేవంత్‌ రెడ్డి, గుర్నాథ్‌ రెడ్డి, కాంగ్రెస్‌పై మాట్లాడడం నీ స్థాయికి తగదని కాంగ్రెస్‌ పట్టణ అధ్యక్షులు నయూం అన్నారు. కొడంగల్‌లోని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌ రెడ్డి నివాసంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఎన్నికలు రావడంతో ప్రజలను మభ్య పెడుతూ రెచ్చగొట్టే విధంగా వాఖ్యలు చేయడం సరైంది కాదన్నారు. మైనార్టీ లను కించపరిచే విధంగా వాఖ్యలు చేయడం సబబు కాదన్నారు. బీఆర్‌ఎస్‌ మైనార్టీలకు రూ.10 కోట్లు అందించినట్టు చెబుతున్నావు..మరి ఎవరికీ ఇచ్చారో చెప్పాలని నిలదీశారు. మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్లు, మైనార్టీ కార్పొరేషన్‌ ఏర్పాటు చేశారా అని ప్రశ్నించారు. భవిష్యత్‌లో ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. కాంగ్రెస్‌ గురించి మాట్లాడే ముందు బీఆర్‌ఎస్‌ నాయకులు వహాబ్‌ కాంగ్రెస్‌ చరి త్ర తెలుసుకోవాలన్నారు. మైనార్టీలకు నాలుగు శాతం రిజర్వేషన్‌ తీసుకువచ్చింది కాంగ్రెెస్సేనని అన్నారు. ఇందిరమ్మ ఇల్లు, పేదలకు భూములు పంపిణీ చేసింది కాంగ్రెస్‌ కాదా అని నిలదీశారు. మజీద్‌కు ఇచ్చిన భూమి ఏమి చేశావో చెప్పాల న్నారు. తమ నాయకులపై, కాంగ్రెస్‌పై మాట్లాడే స్థాయి నీది కాదని హితవు పలికారు.మరోసారి ఇలాంటి ఘటన పునరావృతమైతే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బోంరాస్‌పేట్‌ మైనార్టీ సెల్‌ మండల అధ్యక్షులు అనీష్‌, యూత్‌ కాంగ్రెస్‌ నాయకులు నుమాన్‌, మైనార్టీ సెల్‌ మండల అధ్యక్షులు ఆసిఫ్‌ ఖాన్‌, ఎండి ఆరిఫ్‌, ఎండి జావిద్‌, అశ్వక్‌, తదితరులు పాల్గొన్నారు.