గుంపులు గా గుమికూడడవద్దు…

– దీర్ఘకాలిక వ్యాది బాధితులు అప్రమత్తంగా ఉండాలి..
– సోమవారం నుండి కోవిడ్ నిర్ధారణ పరీక్షలు..
– సూపరింటెండెంట్ డాక్టర్ పూర్ణ చంద్
నవతెలంగాణ – అశ్వారావుపేట
రాష్ట్ర వ్యాప్తంగా మరో సారి కరోనా కలకలం సృష్టించడంతో వైద్యారోగ్యశాఖ అప్రమత్తం అయింది.ఇప్పటికే గతంలో కోవిడ్ చికిత్స కు కేటాయించిన కేంద్రాల్లో ఇప్పటికే రోగులకు కావాల్సిన వైద్య సౌకర్యాలను సిద్దం చేస్తుంది. ఈ క్రమంలో స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రం సూపరింటెండెంట్ డాక్టర్ పూర్ణ చంద్ శుక్రవారం నవతెలంగాణ వివరణ కోరగా సోమవారం నుండి కరోనా వైరస్ ఏంటి జెన్ నిర్ధారణ పరీక్షలు చేయడం ప్రారంభిస్తామని, అందుకు తగ్గ ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. కోవిడ్ నిర్ధారణ అయితే వైద్యం అందజేయడానికి బెడ్ లు,ఆక్సిజన్ సిద్దంగా ఉందని తెలిపారు. గుంపులు గుంపులు గుమికూడవద్దని, ఊపిరి తిత్తుల, గుండె, సుగర్  వ్యాధులు ఉన్న వారు రక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు.