బీఅర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థికి డిపాజిట్‌ రావద్దు

– కాంగ్రెస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి వేముల వీరేశం
నవతెలంగాణ- రామన్నపేట
బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థికి డిపాజిట్‌ దక్కకుండా ప్రతి కాంగ్రెస్‌ కార్యకర్త, నాయకులు కష్టపడి పని చేయాలని కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వేముల వీరేశం పిలుపునిచ్చారు. శనివారం మండలంలోని నిదానపల్లి గ్రామ సర్పంచ్‌ గుత్తా నరసింహారెడ్డిబీఆర్‌ఎస్‌కు రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరారు. ఈ సందర్భంగా వేముల వీరేశం కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చి, రాహుల్‌ గాంధీ ప్రధాని అయితే ప్రజలకు స్వెచ్ఛ లభిస్తుందన్నారు. నిజాయితీతో పార్టీ కోసం పని చేయాలన్నారు. రాహుల్‌ గాంధీ, సోనియా గాంధీ ప్రకటించిన 6 గ్యారంటీలతో ప్రజల జీవితాలలో మార్పు వస్తుందని నమ్ముతూ ప్రజలు కాంగ్రెస్‌ పార్టీని ఆదరిస్తున్నారన్నారు. నకిరేకల్‌ నియోజకవర్గంలో బిఆర్‌ఎస్‌ పార్టీ ఖాళీ అయిపోయిందని, బీఆర్‌ఎస్‌ పార్టీ ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున కాంగ్రెస్‌ లో చేరుతున్నారన్నారు. పార్టీలో చేరిన వారిలో బీఆర్‌ఎస్‌ మాజీ మండల అధ్యక్షులు గంగుల వెంకట రాజారెడ్డి, నిదాన్‌ పల్లి మాజీ సర్పంచ్‌ లు కొండ బుచ్చిబాబు, భీమనబోయిన చంద్రయ్య, ఉప సర్పంచ్‌ నాగపాక లక్ష్మణ్‌, వార్డు సభ్యులు కొండ మల్లేష్‌, కడారి మల్లేష్‌, భాశమల్ల బాలరాజు, నారపాక ఆశోక్‌, మల్లయ్య, బొడిగె రంగయ్య, పబ్బతి అంజనేయులు, మధుసూదన్‌ రెడ్డి, సూధాకర్‌ రెడ్డి, శేఖర్‌, ఆశోక్‌ రెడ్డి, లక్ష్మాపురం గ్రామానికి చెందిన సీనియర్‌ నాయకుడు బత్తుల మల్లేష్‌, రామన్నపేట పట్టణానికి చెందిన వందలాదిమంది కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షులు సిరిగిరెడ్డి మల్లారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు గాదే శోభ రాణి, నాయకులు పున్న రమేష్‌, అయ్యాడపు నర్సిరెడ్డి, నల్ల వెంకటరెడ్డి, అప్పం రామేశ్వరం, దొమ్మాటి లింగారెడ్డి, రామిని రమేష్‌, శంబాల వెంకటేష్‌పాల్గొన్నారు.