రెంజల్ మండలం కందకుర్తి గ్రామంలోని నిరుపేదలు సోమవారం నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను మంజూరు చేయాలని కోరుతూ ప్రధాన రోడ్డుపై ధర్నా నిర్వహించారు. వర్షాకాలంలో ఇంట్లో లేని నిరుపేదలు తమకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మించాలని వారు డిమాండ్ చేశారు. ఈ విషయం తెలిసిన వెంటనే తాసిల్దార్ శ్రావణ్ కుమార్ సంఘటన స్థలానికి వెళ్లి పరిస్థితులను సమీక్షించారు. అర్హులైన నిరుపేదల నివేదికను తీసుకొని సంబంధిత అధికారులతో చర్చించి కేటాయించడానికి తనవంతు సహాయ సహకారాలను అందజేస్తారని హామీ ఇవ్వడంతో వారు విరమించాడు.