మైనర్లకు వాహనాలు ఇచ్చి ఇబ్బందులకు గురికా వద్దని స్టేషన్ హౌస్ ఆఫీసర్ సత్యనారాయణ గౌడ్ మంగళవారం తెలిపారు. వాహనాలు నడిపేవారు ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని, ఒక సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానం కాబట్టి నూతనంగా ఇండ్లు నిర్మించుకునేవారు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. దొంగతనాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. గంజాయి, పేకాట ఆడుతున్న సమాచారం ఇవ్వాలని వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. డీజే లు నిషేధించబడ్డవని, ఎవరు ఎక్కడ పెట్టవద్దని అన్నారు.