జంతువులకు ఏలాంటి హాని చేయొద్దు..

– చిరుత పులి దాడిలో గాయపడ్డ వారికి నష్ట పరిహారం అందజేత…
– రెంజ్ అధికారి రవి మోహన్ భట్..
నవతెలంగాణ- డిచ్ పల్లి
అడవి లో ఉండే జంతువులకు ఏలాంటి హాని చేయొద్దని, ఎప్పుడైన ఎదైన జంతువు సంచారిస్తున్నట్లు కనబడిన వేంటనే  అటవీ శాఖ అధికారులకు సమాచారం అందజేయాలని ఇందల్ వాయి ఫారెస్ట్ రేంజ్ అధికారి రవి మోహన్ బట్ అన్నారు. గురువారం ఇందల్ వాయి రెంజ్ కార్యాలయంలో  చిరుత పులి దాడిలో గాయపడ్డ వారికి నష్ట పరిహారం చెక్కులను రెంజ్ అధికారి రవి మోహన్ భట్ సిబ్బంది తో కలిసి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పెంపుడు జంతువులను అడవి జంతువులు చంపినట్లయితే, అడవి జంతువులపై వీష ప్రయోగం కానీ, వాటిని చంపడం కానీ చేయకుండా సంబంధిత అటవీ శాఖ అధికారులకు వేంటనే సమాచారం అందించాలని, చిరుతల దాడిలో మృత్యువాత పడ్డ గాయపడ్డ  పెంపుడు జంతువులకు అటవీశాఖ బాధితులకు నష్టపరిహరం చెల్లిస్తుందని దీనిలో ఎవరికి ఎలాంటి అనుమానం అవసరం లేదన్నారు కానీ ఇది అధునిక భావించి అడవుల్లో ఉండే జంతువులను వేటాడడం విష ప్రయోగాలు చేయడం చట్ట రిత్యా నేరమని అలా ఎవ్వరు చేయవద్దని అలా ఎవరైనా చేసినట్లు నిరుపన అయితే వారిపై నాన్బెయిలబుల్ కేసు నమోదు చేయబడుతుందని సూచించారు. ఎప్పుడైనా అడవి జంతువుల వల్ల ఎలాంటి నష్టం సంబవించిన అటవీశాఖ నష్టపరిహారం చెల్లిస్తుందని గుర్తుంచుకోవాలని  రవి మోహన్ బట్ పేర్కొన్నారు. అనంతరం ఇందల్ వాయి మండలంలోని మీ కెనాయక్ తాండకు చెందిన సక్కుబాయి కి చెందిన పశువు చిరుత పులి దాడిలో మృతి చెందడంతో 40వేల రూపాయల చెక్కును, చంద్రయాన్ పల్లి గ్రామానికి చెందిన పుర్రెపాయిలు చిరుతపులి దాడిలో గొర్రె మృతి చెందాడంతో7,500, డిచ్ పల్లి మండలం లోని దర్మారం బీ కి చెందిన జందాని నాగేశ్వర్రా రావు  చిరుతపులి దాడిలో ఆవుదూడ మృత్యువాత పడటంతో 30,000 వేలు, ఇందల్ వాయి మండలంలోని సంస్థాన్ సిర్నపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని రాంసాగర్ తండా కు చెందిన లాకావత్ సుధాకర్ చిరుతపులి దాడిలో గెడెదూడ (చిన్నపిల్ల) 20,000 వేల రూపాయల చెక్కు లను అందజేశారు. ఈ కార్యక్రమం లో డిప్యూటీ రేంజ్ అధికారి ఎ శ్రీనివాస్, యానంపల్లి, అమ్సన్ పల్లి, ఫారెస్ట్ సెక్షన్ అధికారులు పి బాపు రావు,డి అనంద్ రాథోడ్, తిర్మన్ పల్లి, సిర్నపల్లి, చంద్రయాన్ పల్లి, మదన్ పల్లి ఫారెస్ట్ బీట్ అదికారులు ఎన్ రాకేష్,ఎస్ అర్చన, ఎన్ పవన్ కుమార్, సాయి దీప్తి తోపాటు తదితరులు పాల్గొన్నారు.