ఎమ్మెల్యే కృష్ణమెహన్‌రెడ్డిని చేర్చుకోవద్దు

– గాంధీభవన్‌ వద్ద గద్వాల కాంగ్రెస్‌ కార్యకర్తల ధర్నా
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
గద్వాల బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డిని చేర్చుకోవద్దంటూ ఆ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్‌ కార్యకర్తలు కోరారు. శుక్రవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌ మెట్లపై ధర్నా నిర్వహించారు. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కాంగ్రెస్‌ పార్టీకి తీవ్ర నష్టం కలిగించిన ఆయన్ను పార్టీలో ఎలా చేర్చుకుంటారని ప్రశ్నించారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బండ్ల కుటుంబం, బంగ్లా కుటుంబం (డీకే అరుణ)తో సనిహిత్నంగా ఉంటూ కాంగ్రెస్‌ అభ్యర్థి సరితమ్మను ఓడించారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ను ఓడించేందుకు బీఆర్‌ఎస్‌, బీజేపీ ఒక్కటయ్యాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో కే. మోహన్‌రావు, ఎస్పీ.ఏ గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.