రహదారి.. చూడతరమా..

Road.. Let's see..నవతెలంగాణ – సిరిసిల్ల
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం పైన పటారం… లోన లొటారం గా మారింది. పట్టణం అభివృద్ధి చేయడంలో సిరిసిల్ల పురపాలక సంఘం విఫలమైంది. పాలకవర్గం తమకు ఎక్కడ ఏం వస్తుంది అనే ఆలోచన తప్ప పట్టణం అభివృద్ధి చేయాలనే ఆలోచన అసలే లేదు. పట్టణంలోని ప్రధాన రహదారులు కొంత అందంగా తీర్చిదిద్దారే తప్ప కార్మిక క్షేత్రంలోకి వెళితే అక్కడి ప్రజలు కనీస సౌకర్యాలు లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయినా మున్సిపల్ అధికారులు పాలకవర్గం మాత్రం పర్సెంటేజీల మత్తులో నిద్రపోతున్నారు. పట్టణంలోని గణేష్ నగర్ లో ఏ రోడ్డు చూసిన బురద గుంతలతో కనిపిస్తుంది. అధికారులు అటువైపు కన్నెత్తి చూడలేదు. అంతేకాకుండా మున్సిపల్ పాలకవర్గం ఆ ప్రాంతంలో కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయడం కోసం నిధులు వెచ్చించడంలో విఫలమైనట్లు కనిపిస్తుంది. జిల్లా కలెక్టర్ సిరిసిల్ల పట్టణ అభివృద్ధిపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.