స్వచ్ఛదనం- పచ్చదనం కార్యక్రమం పట్ల గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న అధికారులు సిబ్బంది నిర్లక్ష్యం వహించరాదని నసురుల్లాబాద్ మండల ప్రత్యేక అధికారి దయానంద్ ఆదేశించారు. బుధవారం కామారెడ్డి జిల్లా నసురుల్లాబాద్ మండలం సంగెం గ్రామంలో నిర్వహిస్తున్న స్వచ్ఛదనం- పచ్చదనం కార్యక్రమంను పరిశీలించారు.గ్రామాల్లో చేపడుతున్న పారిశుధ్య పనులను ఆయన దగ్గరుండి పరిశీలించారు. పాఠశాల ఆవరణతో పాటు ప్రధాన రహదారుల వెంట ఉన్న పిచ్చి పొదలను పంచాయతీ సిబ్బందితో తొలగించి పరిశుభ్రం చేయించారు. గ్రామాల్లో మొక్కను నాటారు. ఆయన వెంట స్థానిక పంచాయతీ కార్యదర్శి అనిల్ కుమార్, కరోబార్ , ఉపాధి హామీ సిబ్బంది తదితరులు ఉన్నారు.