– బాన్సువాడ ఆర్డీఓ రమేష్ రాథోడ్
నవతెలంగాణ – బాన్సువాడ నసురుల్లాబాద్
బాన్సువాడ డివిజన్ పరిధిలోని సమస్యత్మక ప్రాంతాల్లోలలో నిర్వహిస్తున్న ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాల్లో అలసత్వం వహంచవద్దని బాన్సువాడ ఆర్డిఓ రమేష్ రాథోడ్ గ్రామపంచాయతీ ఆరోగ్య సిబ్బందికి ఆదేశించారు. శుక్రవారం బాన్సువాడ మండలంలోని కోనాపూర్ గ్రామంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. గ్రామంలో పారిశుద్ధ్య లోపంతో స్థానిక ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని సమాచారంతో గ్రామంలో అకాస్మిక సందర్శించి గ్రామంలో ఉన్న పలు వీధుల్లో మురికివాడాలను సందర్శించారు. గ్రామంలో పర్యటించి పారిశుద్ధ్య కార్యక్రమాలను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా అయన గ్రామపంచాయతీ భవనంలో ఆయన అవగాహన సదస్సు నిర్వహించారు ఆర్డిఓ మాట్లాడతూ ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాల్లో నిర్లక్ష్యం వహించవద్దని ప్రజారోగ్య ధికారులు, తమకు విధులు కేటాయించాలని కాలవల్లోతీసిన సిల్ట్‌ను వెంటనే సదరు ప్రాంతం నుండి తొలగించాలని ఆయన అధికారులకు సూచించారు. అదే విధంగా చెత్తకుప్పలు నిల్వలేకుండా ఎప్పటికప్పుడు తొలగించాలని కల్వర్ట్ఫాగింగ్ నిర్వహించాలని వర్షపునీరు, మురుగునీరు ఎక్కడైనా నిల్వ ఉంటే కాల్వల్లోకి మరల్చాలని సూచించారు. అంతేకాకుండా విధులు కేటాయించబడిన అధికారులు దోమలు అధికంగా ఉండే ప్రాంతలలో ఫాగింగ్ నిర్వహించాలని సూచించారు. బావులలో లార్వా పెరగకుండా చూడాలన్నారు.
హన్మజీ పేట్ ఆస్పత్రి తనిఖీ
బాన్సువాడ మండలంలోని హన్మజీ పేట్ ప్రభుత్వ ఆసుపత్రికి ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. అధికారుల వైద్య సిబ్బంది హాజరు పట్టికను పరిశీలించారు. ఆస్పత్రిలో ఉన్న ఉద్యోగస్తుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రిలో ఉన్న సౌకర్యాలను అసౌకర్యాలను ఆస్పత్రి సిబ్బందితో అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుత పరిస్థితిలో ఆరోగ్య సిబ్బంది సమయపాలన పాటించాలని అందరూ సకాలంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఉంటూ ప్రజలకు సేవలు అందించాలని ఆయన ఆదేశించారు సమయపాలన పాటించని అధికారులకు సిబ్బందికి తగు చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. వీరి వెంట బాన్సువాడ ఎంపీడీవో, వైద్య ఆరోగ్య అధికారులు, సిబ్బంది, గ్రామపంచాయతీ సిబ్బంది తదితరులు ఉన్నారు.