– ఎంపీడీఓ సత్యనారాయణ
నవతెలంగాణ-జైపూర్
ఏ వయస్సులో ఉన్న వారైనా సరే కంటి చూపు సమస్య వస్తే నిర్లక్ష్యం చేయకుండా వైద్య సేవలు పొందాలని స్థానిక ఎంపీడీఓ గుర్రం సత్యనారాయణ అన్నారు. మంచిర్యాల లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సోమవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరంలో వైద్యులతో కలిసి ఆయన పాల్గొన్నాడు. ఈ సంధర్భంగా మాట్లాడుతూ గత ఐదు రోజుల క్రితం నుంచి మండల పరిధిలో ఉచిత నేత్ర చికిత్స శిబిరం ఏర్పాటు చేస్తున్నట్లు గత ఐదు రోజులుగా మండల పరిదిలో ప్రచారం చేసినట్లు తెలిపారు. ఈ శిబిరంలో 150 మంది కంటి సమస్యలు ఉన్న వారు ఉచిత నేత్ర చికిత్స శిబిరంలో పాల్గొన్నట్లు తెలిపారు. లయన్స్ క్లబ్ మంచిర్యాల గోల్డెన్ జూబ్లీ, లయన్స్ క్లబ్ విజరుకేర్ బెల్లంపల్లి, లయన్స్ ఐ ఆసుపత్రి రేకుర్తి వారి ఆధ్వర్యంలో కంటి వైద్యులు రోగులను పరిక్షించారు. 50 మందికి శస్త్ర చికిత్స అవసరమవుతుండగా వారిని ఆసుపత్రికి తరలించి శస్త్ర చికిత్సల అనంతరం తిరిగి మండల కేంద్రానికి చేర్చనున్నట్లు తెలిపారు. ఉచిత నేత్ర చికిత్స శిభిరంలో లయన్ డాక్టర్ సుగుణాకర్‌రెడ్డి, లయన్ వెంకటేశ్వర్లు, పుల్లూరి బాలమోహన్, డాక్టర్ రాకేష్ రెడ్డి, లయన్ సయ్యద ఇలియాజ్, వాలేటి శ్రీనివాస్ స్థానిక తాజా మాజీ ఎంపీటీసీ లింగస్వామి, గ్రామ పంచాయతి కార్యదర్శి ఉదరు పాల్గొన్నారు.