వంట పనిని ప్రయివేట్‌ సంస్థలకు ఇవ్వొద్దు

వంట పనిని ప్రయివేట్‌ సంస్థలకు ఇవ్వొద్దు– పెండింగ్‌ బిల్లులు వెంటనే చెల్లించాలి
– మధ్యాహ్న భోజన కార్మికుల యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షులు ఎలమోని స్వప్న
– 5వరోజుకు చేరిన రిలే నిరాహారదీక్షలు
నవతెలంగాణ-మంచాల
మధ్యాహ్న భోజన పథకం వంట పనిని ప్రయివేట్‌ సంస్థకు ఇవ్వొద్దని సంఘం యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షులు యేలమోనీ స్వప్న ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. శుక్ర వారం జరిగిన మధ్యాహ్న భోజన కార్మికుల రిలే నిరాహా రదీక్షలో ఆమె మాట్లాడుతూ..మధ్యాహ్న భోజన కార్మి కులు 22 ఏండ్ల నుండి వంట పనిని చేస్తున్నారని డ్వాక్రా సంఘాల నుండి మహిళలను ఈ పథకంలోకి తీసుకు న్నారని రాష్ట్రంలో 2400 మంది కార్మికులు పని చేస్తున్నా రని ఏండ్ల తరబడి సమయానికి జీతాలు, బిల్లులు వేత నాలు రాకపోయినా అప్పులు చేసి వంటలు చేసి పెడుతు న్నారన్నారు. ఇప్పుడు ప్రయివేట్‌ సంస్థలకు ఇస్తే మధ్యా హ్న భోజన కార్మికులు రోడ్డున పడతారని ఇప్పటికే కొన్ని మండలాల్లో అక్షయపాత్ర సంస్థకు ఇచ్చారన్నారు. ఇప్పు డు ప్రయివేట్‌ సంస్థలకు ఇస్తే సహించేది లేదని హెచ్చ రించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఎన్నికల ఎదుట ప్రభుత్వం వస్తే మధ్యాహ్న భోజన కార్మి కులకు రూ.10వేలు వేతనం ఇస్తామని మేనిఫెస్టోలో పె ట్టిందని ఇప్పుడేమో జిల్లాలో 7 మండలాల్లో అక్షయ పాత్ర కు ఇవ్వాలనుకుంటుందని విమర్శించారు. బాలాపూర్‌, అబ్దుల్లాపూర్‌మెట్‌, హయత్‌నగర్‌, నందిగామ, మహేశ్వ రం, శంషాబాద్‌, కొత్తూరు, మండలాల్లో అక్షయ పాత్రకు ఇవ్వాలనుకోవడాన్ని వెనక్కు తీసుకోవాలని కోరారు. వెంటనే పెండింగ్‌లో ఉన్న బిల్లులు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. లేనిచో తమ పోరాటాన్ని ఉదృతం చేస్తామని హె చ్చరించారు. కార్యక్రమంలో సీఐటీయూ మండల కన్వీన ర్‌ పోచమోనీ కృష్ణ, యూనియన్‌ నాయకులు సరిత, అలి వేలు, లక్ష్మమ్మ, జంగమ్మా, భారతమ్మ తదితరులు పాల్గొన్నారు.