
తెలంగాణ రాష్ట్రంలో యూనివర్సిటీలో పనిచేస్తున్న ప్రొపెసర్స్ పదవీ విరమణ వయస్సును పెంచవద్దు అని బుధవారం ఓయూ జేఏసీ ఆధ్వర్యంలో ఓయూలో నిరసన ర్యాలీ నిర్వహించారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకాలకు నోటిఫికేషన్లు వెంటనే జారీ చేయాలని, ప్రభుత్వ యూనివర్సిటీ లలో ప్రొఫెసర్ల పదవీ విరమణ వయసును 65 సంవత్సరాలకు పెంచడం అనే ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వం విరమించుకోవాలని, రాష్ట్రంలో అన్ని యూనివర్సిటీ లలో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టులను భర్తీ చేయాలని కోరారు. ప్రొఫెసర్ల పదవీ విరమణ వయసు పెంచడం వలన అది నిరుద్యోగులకు తీవ్రమైన నష్టం జరుగుతుందన్నారు. ఈ ప్రతిపాదనలు ప్రభుత్వం విరమించుకొని వెంటనే అన్ని యూనివర్సిటీలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ల ను భర్తీ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఓయూ జేఏసీ నాయకులు వేల్పుల సంజయ్, భూ పెల్లి నారాయణ, అందే కృష, జీడీ అనిల్, రమేష్, భాస్కర్, సైదులు, సత్యనారాయణ పాల్గొన్నారు.