– ఎవరి మీద ఈ కక్ష సాధింపు..?
– గ్రామస్తుల మండిపాటు
– బిక్కు బిక్కుమంటూ ప్రయాణాలు
– రోడ్డు మరమ్మతులు నిలిచిపోవడానికి కారకులైన వారు పునరాలోచించాలి
– రోడ్డు నిర్మాణం కోసం సహకరించాలని కోరుతున్న గ్రామస్తులు
నవతెలంగాణ-కందుకూరు
మండలం నేదునూరు, బాచుపల్లి, గ్రామాల మధ్యన 60, 70 ఏండ్ల నుండి 8 కిలోమీటర్ల మేర లింకు రోడ్డు ఉంది. అయితే నేదునూరు గేటు నుండి, నేదునూరు, బాచు పల్లి, పులిమామిడి గ్రామ వరకు ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన పథకం కింద 6 కోట్ల పైబడి నిధులు మంజూరు చేసి బీటీ రోడ్డు వేశారు. 2, 3 ఏండ్ల నుండి ఈ రోడ్డు వేయ కుండా కొంతమంది నిలుపుదల చేశా రని గ్రామస్తులు అంటున్నారు. అయితే నేదునూ రు, బాచుపల్లి, గ్రామాల మధ్యన మోడల్ స్కూల్, దాటిన తర్వాత బాచుపల్లి గ్రామా నికి వెళ్లే, మూలమలుపు, కల్వాటు వద్ద, వర్షాలకు, పెద్ద, పెద్ద గుంతలుపడి ఈ రోడ్డు గుండా ప్రయా ణం చేయాలం టేనే ప్రయాణికులు భయపడు తున్నారు. కారు, బైకు, ఆటో, ఆర్టీసీ బస్సు, ప్రయి వేటు బస్సులు ఏ వాహనమైనా సరే, ఈ రోడ్డు గుండా పోవాలంటే ఇక్కడ కింద పడిపోతామో భయ పడవలసిన పరిస్థితి నెలకొంది. అయితే ఈ రోడ్డు ఆపడానికి ప్రధాన కారణం ఇదే గ్రామానికి చెందిన కొంత మంది రోడ్డు తమ భూమి లో ఉందంటూ హైకోర్టులో కేసు వేశా రని గ్రామస్తులు అంటున్నారు. వాస్త వమా కాదా తెలియదు. అయితే 2 ఏండ్ల పైబడి 400 మీటర్ల బీటీ రోడ్డు వేయకుండా రోడ్డు కాంట్రాక్టర్ వదిలి వెళ్ళిపోయాడు. ఈ రోడ్డును మరమ్మతులు చేసేద ెప్పుడు, బీటీ రోడ్డు వేసేదెప్పుడు అని ఇరు గ్రామస్తులు అంటు న్నారు. ఈ రోడ్డు గుండా సుమారుగా 10 గ్రా మాలకు చెందిన వారు ప్రతిరోజూ ప్రయాణం చే స్తున్నారు. రోడ్డు మరమ్మతులు నిలిచిపోవడానికి కారకులైన వారు పునరాలోచించాలి, రోడ్డు నిర్మా ణం కోసం సహకరించాలని పలువురు గ్రామ స్తులు కోరుతున్నారు.
గుంతల రోడ్డుపై ప్రయాణమంటేనే భయంగా ఉంది
గుంతలమయమైన రోడ్డుపైన ప్రయాణం చేయాలంటేనే భయ మే స్తుంది. 2 ఏండ్ల నుండి రోడ్డు నిలుపుదల చేయ డంతో ఈ రోడ్డుపైన ప్ర యాణం చేసే ప్రయాణికులు నరక యా తనగా ఉంది. రోడ్డు నిలుపుదల చేసినవారు. ఇతర రోడ్లమీద నడవకూడదన్నారు. రోడ్డు నిలుపు దల చేసిన వారికి ప్రభుత్వం నిర్మించిన రోడ్లపై ఎలా తిరుగుతారు. ఎవరి ప్రయోజ నాల కోసం రోడ్డును నిలుపుదల చేశారు. రోడ్డు రవాణా శా ఖ వారు వెంటనే రోడ్డును పరిశీలించి మరమ్మ తులు చేయాలి
పడమటి శ్రీనివాస్ రెడ్డి, నేదునూరు
రోడ్డు నిలుపుదల చేసింది పలుకుబడి చూపించడానికే
తమ వ్యక్తిగత పలుకుబడి చూయిం చు కోవడానికి 10 గ్రా మాల ప్రజలు ప్ర యా ణం చేసే రోడ్డును ని లుపుదల చేశారు. ఏ రోడ్డు అయినా పట్టా భూ ముపై నుండే రోడ్లు నిర్మాణం చేస్తారు. రోడ్డు నిలుపుదల చేసిన వారికి ఆ మాత్రం తెలియ కపోతే ఎట్లా. గ్రామస్తులకు రోడ్డు లేకుండా చేస్తు ఎంసాధిస్తారు. వారి పొలాలకు కూడా వెళ్లాలం టే ప్రభుత్వం వేసిన రోడ్డు పైనుండే వెళ్లాలి. ఆ మాత్రం తెలి యకపోతే ఎట్లా. ఏ గ్రామానికి ఏ పల్లెకు వెళ్లి నా అన్ని రోడ్లూ పట్టా భూముల నుం డి ఉంటయి సపరేటుగా ప్రభుత్వ భూమి రోడ్ల కు తీయరు. రోడ్డు నిలుపుదల చేసిన వారు ప్ర జల కోసం ఆలోచన చేయాలి. ఎంతోమందికి చెందిన రైతుల పంట పొలాల నుండి ప్రభు త్వం రోడ్డు నిర్మాణం చేశారు. ఇప్పటికైనా రోడ్డు నిర్మా ణం చేయడానికి సహకరించాలి – బుడ్డీరపు శ్రీనివాస్, మాజీ ఉపసర్పంచ్ నేదునూరు
రోడ్డు తనపొలం నుంచి పోతుందని గ్రామానికి చెందిన ఒక వ్యక్తి బీటీ రోడ్డు వేయకుండా నిలు పుదల చేశారు. ఆ పొర్టులో రోడ్డు మరమ్మతులు చేయకుండా కోర్టు నుంచి ఆర్డార్ పత్రాలు తీసు కువ చ్చాడు. అందుకే ఆ రోడ్డును నిలుపుదల చేయాల్సి వచ్చింది. వర్షాల కారణంగా రోడ్డు గుంతలు పడి ప్రయాణికులకు ఇబ్బందిఏర్పడుతుంది. శుక్రవారం వర్షాల కారణంగా రోడ్డు గుంతల్లో నిలిచిన నీటిని అయిల్ మిషన్‌తో తొలగించాం. బీటీ రోడ్డు వేయకుండా రోడ్డును నిలుపుదల చేసిన వ్యక్తిని గ్రామస్తు లంతా వెళ్లి రోడ్డు మరమ్మత్తులకు సహకరించాలని అండగండి.
పంచాయతీ రోడ్డుశాఖ ఏఈ సతీశ్