అపరిచితులకు పరిస్థితుల్లోనూ ఆశ్రయం కల్పించవద్దని పసర ఎస్ఐఎస్ కె.మస్తాన్ అన్నారు. మంగళవారం మండలంలోని మచ్చాపూర్ గుత్తి గుంపును కమ్యూనిటీ పొలిసింగ్ లో భాగంగా సిఆర్ పిఎఫ్ సిబ్బందితో కలిసి సందర్శించారు. ఈ సందర్బంగా ఎస్ఐఎస్ కె. మస్తాన్ అక్కడి ప్రజలతో వివిధ రకాల విషయాలను మాట్లాడటం జరిగింది. అపరిచిత వ్యక్తులకు ఆశ్రయం కల్పించకూడదు.. అని ఎవరైనా కొత్త వ్యక్తులు తమ గ్రామంకు వస్తే తమకు సమాచారం అందించాలని తెలియచేసారు. గ్రామ ప్రజల యొక్క సమస్యలను అడిగి తెలుసుకున్నారు. శీతాకాలం దృశ్య త్వరలోనే దుప్పట్లు పంపిణీ చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఇలాంటి సమస్యలు ఉన్న తమ దృష్టికి తీసుకురావాలని పరిష్కారం దిశగా కృషి చేస్తామని అన్నారు.