
నవతెలంగాణ-జక్రాన్ పల్లి : మెదక్ అధ్యక్షతన మండలాన్ని మూడు విభాగాలుగా చీల్చవద్దని జక్రాన్ పల్లి ఫాస్ట్ రేట్ కమిటీ సభ్యులు శుక్రవారం అన్నారు. ఈ సందర్భంగా ఫాస్ట్ రేట్ కమిటీ సభ్యులు సంఘ సభ్యులు సమావేశం ఏర్పాటు చేసుకొని చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా లోని మెదక్ అధ్యక్ష మండలాన్ని మూడు అధ్యక్ష మండలాలుగా చీల్చుతున్న రన్న సమాచారంతో ఉమ్మడి మెదక్ అధ్యక్ష మండలంగా ఉండాలని చర్చ సౌత్ ఇండియాకు ఫాస్ట్ రేట్ తీర్మానం కాపీని పంపిస్తామని పేర్కొన్నారు. మెదక్ అధ్యక్ష మండలంలో ని గోదావరి డిసిసి, మెదక్ డిసిసి, హైదరాబాద్ టౌన్ డిసిసిగా కొనసాగుతున్న డిసిసిలను 3 అధ్యక్ష మండలాలుగా మారుస్తారన్న సమాచారం తెలుసుకొని, మెదక్ అధ్యక్ష మండలాన్ని ఎప్పటి లాగానే ఉంచాలని సినాడుకు తీర్మానం కాపీని పంపిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫాస్ట్రేట్ కమిటీ సభ్యులు కమిటీ, మాజీ ఫాస్ట్ రేట్ సభ్యులు, సంఘ సభ్యులు తదితరులు ఉన్నారు.