నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్
భవన నిర్మాణ సంక్షేమ బోర్డ్ నిధులను కేంద్ర ప్రభుత్వం ఇన్స్యూరెన్స్ కంపెనీలకు అప్ప జెప్పే విధానానికి స్వస్తి చెప్పాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి నెమ్మాది వెంకటేశ్వర్లు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.మంగళ వారం సీఐటీయూ అఖిల భారత పిలుపు మేరకు దేశా వ్యాపితంగా అన్నీ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట జరిగిన నిరసన కార్యక్రమం లో బాగంగా సూర్యాపేట కలెక్టర్ కార్యాలయం ఎదుట భవన నిర్మాణ కార్మిక సంఘం ఆద్వర్యం పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 1.50,000 మంది ఉన్నారనీ ప్రస్తుతం ప్రమాద భీమా ఆరు లక్షలు సహజ మరణానికి సహజ మరణానికి ఒక లక్ష రూపాయలు మరియు దహన సంస్కారాలకు , పెళ్లి,కానుపు ప్రసూతి సహాయము కొరకు 30 లక్షలు చొప్పున అరకొరగా ఇస్తున్నారని వీటిని సంక్షేమ బోర్డ్ నిధులను ఇన్సెరెన్స్ కంపెనీలకు అప్పచెప్పడానికి ప్రతి పాదనలు కేంద్ర ప్రభుత్వం చేయడం సంక్షేమ బోర్డ్ ను ఎత్తి వేసే విధానం తప్ప మరొకటి కాదన్నారు.మొత్తంగా దేశం లో ఉన్న కోట్లాది మంది భవన నిర్మాణ కార్మికులు కోట్లాది మంది పోరాడి సాధించుకున్న సంక్షేమ బోర్డ్ ను లేకుండా చేసీ కార్మికుల హక్కులను హరించ వేయడం తప్ప వేరేది లేదన్నారు. కార్మిక శాఖ కార్యాలయం లో జరుగుతున్న అవినీతిపై విచారణ చెప్పటాలని, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఆరు గ్యారింటీలను భవన నిర్మాణ కార్మికులకు వర్తింప చేయాలనీ, రాష్ట్ర ప్రభుత్వం గుర్తింపు కార్డు ఉన్న ప్రతి కార్మికునికి టూ వీలర్ వాహనాన్ని ఉచితంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు… ప్రమాద భీమా ను దరఖాస్తు చేసుకున్న నెల రోజుల లోపులనే భాదిత కుటుంభాలకు అందజేయాలని నెమ్మాది కోరారు.ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు మల్లయ్య , సీఐటీయూ జిల్లా కమిటి సభ్యులు సాయి కుమార్,ఎల్లయ్య లింగయ్య రాము, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.