అడ్డదారిలో భర్తీ చేయకండి

నవతెలంగాణ-నిజామాబాద్ సిటీ : తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ సాధించుకున్న తర్వాత కొందరిని ప్రభుత్వం అడ్డదారిలో బ్యాక్లాగ్ ఉద్యోగాలను భర్తీకి చేయడం జరిగిందని పలు సందర్భాలలో పలువురు ఆరోపణలు చేశారని నిజామాబాద్ నిరుద్యోగులు ఆరోపణ చేస్తున్నారు. అంతేకాకుండా గుట్టు చప్పుడు కాకుండా కొన్ని జిల్లాలలో మున్సిపల్, ఇరిగేషన్, రెవెన్యూ తదితర శాఖల ఉద్యోగులను భర్తీ చేయడం జరిగిందని అదే పద్ధతిలో ప్రస్తుతం కూడా తెలంగాణలో మళ్లీ అడ్డదారిలో బ్యాక్లా ఉద్యోగాలు భర్తీకి సన్నాహాలు చేస్తున్నారని పలువురు నిరుద్యోగ ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పటికైనా బ్యాక్లాగ్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి ప్రభుత్వం నియమ నిబంధనలు పాటిస్తూ బ్యాక్లాగ్ పోస్టులని భర్తీ చేస్తే న్యాయంగా ఉంటుందని నిరుద్యోగ ఆరోపణ చేస్తున్నారు.