– పట్టణ పరిశుభ్రత కే ప్రాధాన్యం..
– పారదర్శకత పాలనే ధ్యేయం..
– మున్సిపల్ కమీషనర్ సుజాత
నవతెలంగాణ – అశ్వారావుపేట
పట్టణం నిత్యం పరిశుభ్రంగా ఉంచాలని,విధుల్లో అలసత్వం వహించే ఎవరిని సహించేది లేదని మున్సిపల్ కమీషనర్ కే.సుజాత హెచ్చరించారు. ఈ నెల 27 న మంగళవారం బాధ్యతలు చేపట్టిన అనంతరం గురువారం ఆమె ప్రధమంగా సమావేశం నిర్వహించారు. ఇందులో ఆమె సిబ్బంది ని పరిచయం చేసుకోవడంతో పాటు పరిపాలనా పరం అయిన పలు విషయాల చర్చించారు. పంచాయితీ మున్సిపాల్టీ గా మాత్రమే రూపొందింది అని,ఎవరి విధుల్లో వారు కొనసాగుతారని తెలిపారు.విలీనం అయిన మూడు పంచాయితీల కార్యదర్శులు సైతం వారికి తగిన హోదాలో ఇక్కడే కొనసాగుతారని తెలిపారు. పారదర్శకత పాలన అందించడమే ముఖ్య ప్రమాణం అని,పట్టణం నిత్యం పరిశుభ్రంగా ఉంచేందుకు పారిశుధ్యం సిబ్బంది కృషి చేయాలని తెలిపారు. అనంతరం కమీషనర్ సుజాతను కార్యాలయం సిబ్బంది పుష్పగుచ్ఛం అందించి,శాలువాతో సన్మానించారు. ఈ సమావేశంలో అధికారులు కమీషనర్ పీఏ చావా రవి,ఏఈ రాము,టీపీవో కిరణ్ కుమార్,జేఏఓ నవీన్ కుమార్,కార్యదర్శి కోటమర్తి శ్రీరామమూర్తి లు పాల్గొన్నారు.