దళారులకు నమ్మి  మోసపోకండి..

Don't be fooled by brokers..– హన్మాజీపేట, లింగంపల్లి, బొల్లారం గ్రామాల్లో వరి ధాన్యం కొనుగోళ్లు..
– ప్రారంభించిన పాక్స్ చైర్మన్, కేడీసీసీ బ్యాంకు డైరెక్టర్ ఏనుగు తిరుపతి రెడ్డి..
నవతెలంగాణ – వేములవాడ రూరల్
రైతులకు సహకార సంఘాలు అండగా ఉంటాయని పాక్స్ చైర్మన్, కేడీసీసీ బ్యాంకు డైరెక్టర్ ఏనుగు తిరుపతి రెడ్డి అన్నారు. వేములవాడ రూరల్ మండలం హన్మాజీపేట, లింగంపల్లి, బొల్లారం గ్రామాల్లో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రైతులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏనుగు తిరుపతి రెడ్డి  మాట్లాడుతూ రైతులకు ఎల్లప్పుడూ సహకార సంఘాలు అండగా ఉంటాయని, పండించిన ధాన్యాన్ని రైతులు అమ్మడానికి ఇబ్బందులు పడకుండా సొసైటీ సంఘాలు కొనుగోలు చేస్తున్నాయన్నారు. ఫ్యాక్స్ ఆధ్వర్యంలో ప్రతి గ్రామాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో, వరి ధాన్యాన్ని తడవకుండా రైతులు చూసుకోవాలని, వరి ధాన్యం కోసం కవర్లను అందజేస్తున్నట్లు తెలిపారు.రైతులందరూ వరి ధాన్యాన్ని దళారులకు నమ్మి మోసపోకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో విక్రయించాలని సూచించారు. కార్యక్రమంలో సెస్ డైరెక్టర్ ఆకుల దేవరాజం, వైస్ చైర్మన్ లక్ష్మీ కాంతారావు, లింగంపల్లి మాజీ సర్పంచ్ సామ కవిత – తిరుపతి రెడ్డి,  మాజీ సర్పంచ్ జంకె విజయ- శ్రీనివాస్ రెడ్డి, బొల్లారం మాజీ సర్పంచ్ సుద్దాల లచ్చయ్య,మాజీ ఉప సర్పంచ్ జంకె మధు, స్థానిక నాయకులు,కాంగ్రెస్ నాయకులు, రైతులు గ్రామస్థులు తో పాటు తదితరులు పాల్గొన్నారు.