నవతెలంగాణ – చండూరు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం , నాలుగు రోజులుగా నిర్వహిస్తున్న ప్రజా పాలన,గ్రామసభల్లో ప్రతిపక్ష నేతలు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారని, వారి దళారి మాటలు నమ్మవద్దు అని కాంగ్రెస్ మున్సిపల్ పట్టణ అధ్యక్షులు అనంత చంద్రశేఖర్ గౌడ్ అన్నారు. శుక్రవారం వార్డు సభలు ముగింపు సందర్భంగా స్థానిక ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్త సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. సభలకు వచ్చిన ప్రతిపక్షాల పార్టీ సభ్యులు అల్లరి చేయడానికి, భగ్నం చేయడానికి వచ్చారన్నారు. అలాంటి వాళ్లకు రానున్న ఎన్నికల్లో ప్రజలే బుద్ధి చెప్పాలన్నారు. గత పది సంవత్సరాల అధికారంలో ఉండి ఒక్కటంటే ఒక్క రేషన్ కార్డు, ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదని దౌర్భాగ్య స్థితిలో బి ఆర్ ఎస్ ప్రభుత్వం ఉందన్నారు. పట్టణాల్లో ఏర్పాటు చేసిన డబుల్ బెడ్ రూం ఇల్లు కూడా నాసిరకంగా కట్టి కాంట్రాక్టర్ లను మాత్రమే బతికించారని, పేదలను పట్టించుకోలేదన్నారు. గ్రామసభల్లో అర్హత కలిగిన ప్రతి నిరుపేదను గుర్తించి విడుదలవారీగా వారికి లబ్ధిని చేకూరుస్తామని తెలిపారు. గతంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లక్ష రూపాయల రుణమాఫీ చేయకుండా కాలయాపన చేసింది అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలో హామీ ఇచ్చిన మేరకు 2 లక్షల రుణమాఫీ చేయడం, ఉచిత మహిళలకు బస్సు ప్రయాణం ఇవ్వడం జరిగిందన్నారు. ప్రతి ఒక్క గ్యారెంటీని అమలు చేసుకుంటూ వెళ్తుంటే ప్రతిపక్షాలకు అభివృద్ధిని చూసి తట్టుకోలేక పోతున్నారని మండిపడ్డారు. అర్హుల జాబితాలో రానివారు మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ వైస్ ఛైర్మన్ దోటిసుజాత వెంకటేష్ యాదవ్, నల్లగొండ ట్రస్మా అధ్యక్షుడు కోడి శ్రీనివాసులు,మాజీ సర్పంచులు కోడి గిరిబాబు,కల్మికొండ పారిజాత జనార్దన్, నల్లగంటి మల్లేశ్,రామ్మూర్తి,భూతరాజు వేణు,ముజ్జు,పున్న ధర్మేందేర్,ఐతరాజు మల్లేశ్, బీమనపల్లి శేఖర్, సంకోజు బ్రాహ్మం, భూతరాజు దశరథ, గండూరి జనార్ధన్, కల్లెట్ల మారయ్య, ఖాళీళ్, జావిద్, గౌస్ తదితరులు పాల్గొన్నారు.