కోడ్ అమల్లో ఉన్నప్పుడు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేపట్టవద్దు..

– కొనసాగుతున్న పనులు టెండర్ ప్రక్రియ, ప్రారంభనికి చేపట్టిన పనుల వివరాలు అందించాలి.జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట్రావ్.
నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్
జిల్లాలో లోక్ సభ ఎన్నికల కోడ్  అమలులో ఉన్నందున వివిధ శాఖల ద్వారా నాన్ స్ట్రాట్ (పనులు ప్రారంభించినవి) పనుల  వివరాలను సత్వరమే అందచేయాలని జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట్రావ్ అధికారులను ఆదేశించారు.మంగళవారం కలెక్టరేట్ లో వివిధ శాఖల అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, ఇతర శాఖల ఇంజనీర్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన  పాల్గొన్నారు.ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ  జిల్లాలో వివిధ శాఖల ఆధ్వర్యంలో ఎన్నికల కోడ్ కు ముందు జరుగుతున్న పనులు అలాగే  కోడ్ తదుపరి ఉన్న పనులు, టెండర్ ప్రక్రియలో గల పనుల వివరాలు సత్వరమే అందించాలని సూచించారు.జిల్లాలో మోడల్ కోడ్ కాండక్ట్ అమలులో ఉన్నందున నాలుగు నియోజక వర్గాల్లో ఎక్కడ కూడా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేపట్టరాదని సూచించారు.కోడ్ కు ముందు జరుగుతున్న పనులు యధావిధిగా కొనసాగింపులు చేసుకోవచ్చని సూచించారు. పనులు టెండర్ ప్రక్రియలో ఉన్న నివేదికలో చూపాలని, అలాగే ఎన్నికల నిబంధనలకు విరుద్దంగా పనులు చేపడితే బాద్యులను చేస్తామని సూచించారు.  నీటి పారుదల, రోడ్డు భవనాల శాఖ, పంచాయతీ రాజ్, మిషన్ భగీరథ ఇంట్రా, గ్రిడ్,  వైద్య ఆరోగ్య శాఖ, మున్సిపాలిటీలు వ్యవసాయ శాఖ, యస్.సి, బి.సి వెల్ఫేర్ తదితర శాఖల  పనుల పై సమీక్షించారు. జిల్లాలో వర్షాభావ పరిస్థితులు ఉన్నందున ఎక్కడ కూడా నీటి ఎద్దడి రాకుండా చూడాలని అలాగే ఈ సమస్యపై రాష్ట్ర స్థాయిలో చర్చించడం జరుగుతుందని అన్నారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బి.ఎస్. లత, ఎం సి సి నోడల్ అధికారి డి ఎఫ్ ఒ సతీష్ కుమార్ ఈ.ఈ పి.ఆర్. ఎం.వేంకటేశ్వర రావు,ఈ ఈ ఇరిగేషన్. రమేష్, ఈ.ఈ. ఆర్ అండ్ బి. భాస్కర్ రావు, టి ఎస్ ఐ డి సి రమేష్, మున్సిపల్ కమీష్నర్ శ్రీనివాస్, డి ఈ  ప్రసాద్, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.