ప్లాస్టిక్ సంచులను, కవర్లను వాడవద్దు

Do not use plastic bags and covers– మున్సిపల్ కమిషనర్ మహమ్మద్ ఆయాజ్
– ప్లాస్టిక్ సంచులు , పరిసరాలు పరిశుభ్రత పై అవగాహన
నవతెలంగాణ – జమ్మికుంట
 ప్లాస్టిక్ సంచులను కవర్లను వాడవద్దని , బ్యాగులు ,బట్ట సంచులు వాడాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని మున్సిపల్ కమిషనర్ మహమ్మద్ ఆయాజ్ అన్నారు. బుధవారంజమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని సంఘ సభ్యులకు పరిసరాల పరిశుభ్రత, సింగల్ యూస్ ప్లాస్టిక్ పై మున్సిపల్ కమీషనర్ మహమ్మద్ అయాజ్ అవగాహన కల్పించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడారు. మున్సిపాలిటీ పరిధిలోని ప్రతి మహిళా ముందడుగు వేసి పరిసరాలను పరిశుభ్రతగా ఉంచుతూ, వర్షాల వల్ల నీరు నిల్వ ఉన్న చోట ప్రతి శుక్ర,  మంగళ వారాలలో డ్రై డే నిర్వహించి, మీ ఇంటితో పాటు చుట్టూ పక్కల ఇండ్లలో కూడా డ్రై డే చేయు విధంగా చూడాలన్నారు. నీరు నిల్వ ఉన్న చోట దోమలు పెరిగి డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున జాగ్రత్తలు పాటించాలని అన్నారు. వార్డులలో వచ్చే చెత్త బండికి తడి, పొడి చెత్తను వేరు చేసి వాహనాలకు అందించాలన్నారు. ప్రతి సంఘ సభ్యురాలు బ్యాంకు ద్వారా అందించే రుణాలతో ఆర్ధిక ఎదుగుదలకు ఉపయోగించాలని ఆయన అన్నారు. కూరగాయలకు, ఇతర సామాగ్రి  ప్లాస్టిక్ సంచులను, కవర్లతీసుకునేటప్పుడును వాడవద్దని, జ్యూట్ బ్యాగ్ లు, బట్ట సంచిని ఉపయోగించాలని ఆయన అన్నారు. మీతో పాటు ఇంటి చుట్టూ పక్కల వారికీ కూడా అవగాహన కల్పించాలన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ మేనేజర్ రాజిరెడ్డి, సిఎల్ఆర్పీ మంజుల, ఆర్పీలు దేవేంద్ర, కె రజిత, మల్లీశ్వరి తదితరులు పాల్గొన్నారు.