ప్రభుత్వం మారిన అధికారులు మారరా..

నవతెలంగాణ – డిచ్ పల్లి
యూనివర్సిటీలో జరిగిన బాలికల వసతి గృహంలో  ప్రమాదకరమైన ఫుడ్ పాయిజన్ జరిగిందని, దీనిపై తక్షణమే యూనివర్సిటీ ఉన్నత అధికారులు స్పందించాలని, రాష్ట్రం లో ప్రభుత్వం మారిన యూనివర్సిటీలో ఉన్నత అధికారుల వైఖరి మారక పోవడం గమనార్వమని, కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల గురించి ఆలోచిస్తుంటే ఉన్నతాధికారులు వారి స్వార్థం కోసం విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడడం ఎంతవరకు సమంజసమని ఎన్ ఎస్ యుఐ యూనివర్సిటీ అద్యక్షులు కోమిర శ్రీశైలం అన్నారు. శుక్రవారం తెలంగాణ యూనివర్సిటీ లోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ముందు నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా కొమిర శ్రీశైలం మాట్లాడుతూ.. వేంటనే దీనిపై స్పందించి విద్యార్థుల పక్షాన నిలబడాలని కోరుతున్నామన్నారు. లేదంటే ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చిన వారౌతరని పేర్కొన్నారు. ఇప్పటికైనా మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ ఎన్ ఎస్ యు ఐ ఉపాధ్యక్షుడు మహేష్,ప్రధాన కార్యదర్శులు రాజేందర్, సాగర్ నాయక్,వంశీ,ప్రసాద్,శివ తదితరులు పాల్గొన్నారు.