కల్కి విజయాన్ని పరిశ్రమ సక్సెస్‌గా భావిస్తున్నా

Ashwinidatఅమితాబ్‌ బచ్చన్‌, కమల్‌ హాసన్‌, ప్రభాస్‌, దీపికా పదుకొనె లీడ్‌ రోల్స్‌లో నటించిన చిత్రం ‘కల్కి 2898 ఎడి’. వైజయంతీ మూవీస్‌ బ్యానర్‌ పై సి. అశ్వనీదత్‌ నిర్మించారు. మైథాలజీ -ఇన్స్‌స్పైర్డ్‌ సైన్స్‌ ఫిక్షన్‌ విజువల్‌ వండర్‌గా ఈనె 27న విడుదలై ప్రపంచ వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించి, ఎపిక్‌ బ్లాక్‌ బస్టర్‌ సక్సెస్‌ని అందుకుంది. రికార్డ్‌ బ్రేకింగ్‌ కలెక్షన్స్‌తో హౌస్‌ఫుల్‌గా రన్‌ అవుతోంది. ఈ నేపథ్యంలో శంకరపల్లిలోని ‘కల్కి’ సెట్స్‌లో గ్రాండ్‌గా జరిగిన మీడియా ఇంటరాక్షన్‌లో డైరెక్టర్‌ నాగ్‌ అశ్విన్‌ మాట్లాడుతూ, ‘అందరూ మూవీ చూస్తునందుకు, ఎంకరేజ్‌ చేస్తున్నందుకు, ఇంత గొప్ప సక్సెస్‌ని ఇచ్చినందుకు మా టీం, వైజయంతీ మూవీస్‌ తరపున థ్యాంక్స్‌. ఇది హోల్‌ ఇండిస్టీ సక్సెస్‌గా భావిస్తున్నాను. ఎన్నో ప్రొడక్షన్స్‌, యాక్టర్స్‌, రైటర్స్‌, అప్‌ కమింగ్‌ డైరెక్టర్స్‌కి ఒక డోర్‌ ఓపెన్‌ అయ్యింది. ఇలాంటి సైన్స్‌ ఫిక్షన్‌ కథలు రాసుకునే వారికి ‘కల్కి’ రిఫరెన్స్‌ పాయింట్‌లా ఉంటుంది. తెలుగు సినిమా అంటే మనకి గుర్తుకొచ్చేది ‘మాయాబజార్‌’. మాయాబజార్‌ మహా భారతానికి ఒక అడాప్ట్టేషన్‌. ఆ పర్టిక్యులర్‌ ఇన్సిడెంట్స్‌ మహాభారతంలో ఎక్కడా లేదు. అదొక క్రియేటివ్‌ ఫిక్షన్‌. అక్కడి నుంచే ఈ కల్కి కథకు ఇన్స్పిరేషన్‌ వచ్చింది. పార్ట్‌ 2కి సంబంధించి 20 రోజులు షూట్‌ చేశాం. ఇంకా చాలా చేయాలి. చాలా యాక్షన్‌, బ్యాక్‌ స్టోరీస్‌, న్యూ వరల్డ్స్‌ ఇలా చూడటానికి చాలా ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు క్రియేట్‌ చేయాలి (నవ్వుతూ). వైజయంతీ మూవీస్‌ 50 ఏళ్ల జర్నీలోనే కాదు. తెలుగు సినిమా హిస్టరీలోనే ఇది వన్‌ అఫ్‌ ది మోస్ట్‌ ఎక్స్‌పెన్స్సీవ్‌ ఫిల్మ్‌. ఈ సినిమా గొప్ప సక్సెస్‌ సాధించి మా ఇన్వెస్ట్‌మెంట్‌ ఫుల్‌గా రావడం అనేది చాలా థ్యాంక్‌ ఫుల్‌గా భావిస్తున్నాను. ప్రభాస్‌కి ఈ కథ చెప్పినప్పుడు చాలా ఎగ్జైట్‌మెంట్‌ అయ్యారు. ప్రాజెక్ట్‌ని బిలీవ్‌ చేసి, బాగా ప్రోత్సహించారు’ అని అన్నారు.