అదృష్టంగా భావిస్తున్నా..

Do you feel lucky?రవితేజ ప్రొడక్షన్‌ బ్యానర్‌ ఆర్‌టి టీమ్‌వర్క్స్‌లో రాబోతున్న కాన్సెప్ట్‌ బేస్డ్‌ చిత్రం ‘ఛాంగురే బంగారురాజా’. సతీష్‌ వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఫ్రేమ్‌ బై ఫ్రేమ్‌ పిక్చర్స్‌తో కలిసి రవితేజ నిర్మించారు. కార్తీక్‌ రత్నం, గోల్డీ నిస్సీ జంటగా నటించారు. వినాయక చవితి సందర్భంగా ఈనెల 15న ఈ సినిమా రిలీజ్‌ అవుతున్న నేపథ్యంలో హీరోయిన్‌ గోల్డీ నిస్సీ మీడియాతో ముచ్చటించింది. ‘నేను తెలుగమ్మాయిని. కొన్ని షార్ట్స్‌ ఫిలిమ్స్‌ చేశాను. ఇది నా ఫస్ట్‌ బిగ్‌ సినిమా. ఇందులో నా పాత్ర పేరు మంగరత్నం. కానిస్టేబుల్‌. కొంచెం గ్రే షేడ్‌ ఉంటుంది. నన్ను బంగార్రాజు ఇష్టపడతాడు. మా లవ్‌ ట్రాక్‌ చాలా ఆసక్తికరంగా ఉంటుంది.రవితేజ నిర్మాణంలో నా తొలి సినిమా చేయడం అదష్టం. దర్శకుడు సతీష్‌ రాసిన స్క్రిప్ట్‌ చాలా బాగుంది’ అని గోల్డీ నిస్సీ చెప్పింది.