అదృష్టంగా భావిస్తున్నా..

అదృష్టంగా భావిస్తున్నా..వెంకటేష్‌ నటించిన తన 75వ చిత్రం ‘సైంధవ్‌’. శైలేష్‌ కొలను దర్శకత్వం వహించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై నిర్మాత వెంకట్‌ బోయనపల్లి నిర్మించిన ఈ చిత్రం ఈనెల 13న గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో నిర్మాత వెంకట్‌ బోయనపల్లి మీడియాతో పలు విశేషాలను షేర్‌ చేసుకున్నారు.
వెంకటేష్‌ నాకు ఇష్టమైన హీరో. నానితో ‘శ్యామ్‌ సింగరారు’ సినిమా చేస్తున్న సమయంలో శైలేష్‌ కొలను ‘హిట్‌’ ట్రైలర్‌ చూశాను. అది నాకు, నానికి చాలా నచ్చింది. అప్పటికే నాకు శైలేష్‌తో పరిచయం ఉంది. వెంకటేష్‌తో కలిసి సినిమా చేస్తే బావుంటుందని అనుకున్నాం. వెంకటేష్‌కి శైలేష్‌ కథ నెరేట్‌ చేయటం, వాళ్ళిద్దరి వేవ్‌ లెంత్‌ చక్కగా కలవడంతో 24 గంటల్లో ప్రాజెక్ట్‌ ఓకే అవ్వడం చాలా సర్‌ప్రైజ్‌గా అనిపించింది. వెంకటేష్‌ 75వ చిత్రం చేసే అవకాశం రావడం నా అదష్టంగా భావిస్తున్నాను.
నవాజుద్దీన్‌ సిద్ధిఖీ, ఆర్య, ఆండ్రియా ఇలా భారీ తారాగణం ఉండటంతో బడ్జెట్‌ పరంగా ఎక్కువ ఖర్చుతో కూడుకున్నదే. అయితే ఈ కథ చాలా పెద్దది. కథ అనుకున్నప్పుడే ఇది ఎక్స్‌ఎన్సీవ్‌ మూవీ అని తెలుసు. కథకు తగట్టుగా చాలా గ్రాండ్‌గా నిర్మించాం. సంక్రాంతికి ఫ్యామిలీ కథలు రావడం వేరు. ఇలాంటి యాక్షన్‌ కథలు రావడం అరుదు కదా అని చాలా మంది అడుగుతున్నారు. కానీ ‘సైంధవ్‌’ చూస్తున్నప్పుడు అందులోని అద్భుతమైన ఎమోషన్‌ కన్నీళ్లు తెప్పిస్తుంది. సినిమా చూసి బయటికి వస్తున్ననప్పుడు ప్రేక్షకుడి కళ్ళల్లో గొప్ప భావోద్వేగంతో కూడిన కంటతడి కనిపిస్తుంది. ఇది న్యూ ఏజ్‌ యాక్షన్‌తో కూడిన మంచి ఫ్యామిలీ సినిమా.
వెంకటేష్‌ సినిమా అవుట్‌ఫుట్‌ పట్ల చాలా ఆనందంగా ఉన్నారు. దీంతో ప్రమోషనల్‌ ఈవెంట్స్‌ని చాలా ఎంజారు చేస్తూ చేశారు. సహజంగా ఒక సినిమా విజయం సాధించిన వెంటనే హీరోలకు, దర్శకులకు నిర్మాతలు అడ్వాన్స్‌లు ఇస్తుంటారు.. అయితే ఆ ధోరణికి నేను దూరం. ఎందుకంటే నేను ఇష్టమైన వ్యక్తులతో పని చేయాలని భావిస్తాను. నాని నాతో రెండు సినిమాలు చేసి నన్ను నిర్మాతని చేశారు. అలాగే వెంకటేష్‌ అంటే కూడా చాలా ఇష్టం. నాకు ఇష్టమైన ఇద్దరి హీరోలతో కలిసి సినిమాలు చేశాననే ఆనందం ఉంది.
‘వెంకీ 75’ వేడుక ఆలోచన హీరో రానాది. సినిమా మొదలు పెట్టి నప్పుడే స్పెషల్‌ ఈవెంట్‌ చేయాలని అనుకున్నాం. ఆ క్రెడిట్‌ రానాకి దక్కుతుంది.
సంక్రాంతి బరిలో నుంచి ‘ఈగల్‌’ వాయిదా వేయడం హీరో రవితేజ, మేకర్స్‌ గొప్పదనం. ఇది అందరికీ బెనిఫిట్‌ అవుతుందని భావిస్తున్నాం.
వెంకటేష్‌, నానితో మల్టీ స్టారర్‌ చేయాలనే ఆలోచనలో ఉన్నాను. ఇద్దరూ నాకు బాగా ఇష్టమైన హీరోలు. ఇద్దరితో విడివిడిగా సినిమాలు చేశాను. వారిద్దరితో మల్టీస్టార్ట్‌ మూవీ చేయాలనేది నా డ్రీమ్‌. మంచి కథ కోసం నేను ప్రయత్నిస్తా. ఎవరు చేసినా ఎంజారు చేస్తాను.
– నిర్మాత వెంకట్‌ బోయనపల్లి