అదృష్టంగా భావిస్తున్నా..

Do you feel lucky?‘ఇండిస్టీలో నిర్మాతగా 25 ఏండ్లు పూర్తి చేసుకోవడం అదష్టంగా భావిస్తున్నాను. ఈ జర్నీ అత్యద్భుతం’ అని నిర్మాత బెల్లంకొండ సురేష్‌ చెప్పారు. నేడు (గురువారం) ఆయన పుట్టినరోజు. ఇది ఆయన 57వ బర్త్‌డే కావడం ఓ విశేషమైతే, నిర్మాతగా 25 ఏండ్లు పూర్తి చేసుకోవడం మరో విశేషం. ఈ నేపథ్యంలో బుధవారం తన సినీ జర్నీ గురించి, చేయబోయే ప్రాజెక్ట్స్‌ గురించి మీడియాతో షేర్‌ చేసుకున్నారు. శ్రీహరి ‘సాంబయ్య’ సినిమాతో సక్సెస్‌ఫుల్‌గా జర్నీ స్టార్ట్‌ చేశాను. ఈ 25 ఏండ్లలో 38 సినిమాలు చేశాను. నిర్మాతగా కీర్తి ప్రతిష్టలు సంపాదించు కున్నాను. ఇన్నేండ్ల జర్నీ నాకెంతో సంతృప్తినిచ్చింది.
9 ఏండ్ల తర్వాత ఏప్రిల్‌ నుంచి మళ్ళీ సినిమాలు స్టార్ట్‌ చేస్తున్నాను. ఫస్ట్‌ మా అబ్బాయితోనే సినిమా తీస్తున్నాను. ఇదే ఈ బర్త్‌డే స్పెషల్‌. ఇన్నాళ్ళ గ్యాప్‌కి కారణం మా పిల్లలు ఇద్దరూ హీరోలుగా బయట సినిమాలు చేయటమే.
పెద్ద అబ్బాయి శ్రీనివాస్‌ ప్రస్తుతం నాలుగు ప్రాజెక్ట్స్‌ చేస్తున్నాడు. ‘టైసన్‌ నాయుడు, సాహూ’ సినిమాలు జరుగుతున్నాయి. ‘గరుడన్‌’కి రీమేక్‌గా చేస్తున్న సినిమా క్రిస్మస్‌కి విడుదల అవుతుంది. కోడిరామకష్ణ అల్లుడు నిర్మాణంలో చేస్తున్న సినిమా మ్యాసీవ్‌ బడ్జెట్‌ ఫిల్మ్‌. దానికి చాలా సీజీ వర్క్‌ ఉంటుంది. అది చాలా పెద్ద సినిమా. మా అబ్బాయిలు ఇద్దరూ కెరీర్‌పరంగా సెట్‌ అవ్వడం చాలా హ్యాపీగా ఉంది.
‘నా అటోగ్రాఫ్‌’ సినిమాని 4కేలో రాబోయే రవితేజ బర్త్‌డేకి రిలీజ్‌ చేయాలని ప్లాన్‌ చేస్తున్నాం. ఇటీవల రీ-రిలీజ్‌ చేసిన ‘చెన్నకేశవ రెడ్డి’కి మేం ఊహించిన దానికంటే అద్భుతమైన రెస్పాన్స్‌, రెవెన్యూ వచ్చింది. మళ్ళీ బాలయ్యతో వంద శాతం సినిమా చేస్తాను. అలాగే ఒక రీమేక్‌ తీసుకున్నా. కథ నచ్చితే కొత్త దర్శకులతోనూ సినిమాలు నిర్మిస్తా.