డు యూ నో నాటు..

ఈసారి ఆస్కార్‌ అవార్డుల ప్రదానోత్సవంలో బాలీవుడ్‌ అగ్రనటి దీపికా పదుకొనె ప్రెజంటర్‌గా మెరిసి అందర్నీ సర్‌ప్రైజ్‌ చేయటం ఓ విశేషమైతే, ప్రపంచ వ్యాప్తంగా విపరీతమైన క్రేజ్‌ని సొంతం చేసుకున్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ నాటు పాట గురించి ఆస్కార్‌ వేదికపై చెప్పేందుకు రావడం మరో విశేషం. ఈ పాట ఆర్‌ఆర్‌ఆర్‌లో ఒక ముఖ్యమైన సన్నివేశంలో వచ్చింది. ఈ సినిమా స్నేహం ఆధారంగా, ముఖ్యంగా ఇద్దరు రియల్‌ లైఫ్‌ విప్లవ వీరులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీం మధ్య నడిచింది. ఈ పాటని తెలుగులో పాడటమే కాకుండా, వలసవాద వ్యతిరేక ఉద్యమానికి నాందిగా ఇది ఉర్రూతలూగించింది. ఈ పాటకి మిలియన్స్‌ కొద్దీ వ్యూస్‌ యూట్యూబ్‌ లోనూ, టిక్‌ టాక్‌ లోనూ, అలాగే వరల్డ్‌ వైడ్‌గా థియేటర్స్‌లో ప్రేక్షకులు లేచి డాన్స్‌ చేశారు కూడా. ఇది మొదటి ఇండియన్‌ ప్రొడక్షన్‌ కంపెనీ నుండి ఆస్కార్‌కి నామినేట్‌ అయిన మొదటి పాట కూడా’ అని చెప్పి, ‘నాటు అంటే మీకు తెలుసా’ అని అడిగారు. ‘ఒకవేళ మీకు తెలియకపోతే, ఇప్పుడు తెలుసుకుంటారు’ అంతేకాదు ‘నాటు నాటు’ పాటా చూస్తూ వింటారు అని చెప్పారు. గాయకులు కాలభైరవ, రాహుల్‌ సిప్లిగంజ్‌ లైవ్‌లో పాడగా, వెన్ట్రన్‌ డాన్సర్లు తమ డ్యాన్స్‌తో అలరించారు. ఈ పాట ప్రదర్శన పూర్తయిన తర్వాత అందరూ లేచి నిల్చుని చప్పట్లతో అభినందిచడం విశేషం.