సందర్శనకు వెళితే తాళం వేస్తారా…!

– బీఅర్ఎస్ విద్యార్థి నాయకుల ధర్నా 
నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్ 
విద్యార్థి సంఘ నాయకులు గురుకుల పాఠశాల సందర్శనకు వెళితే పరిశీలించకుండా తాళం వేస్తారా అని బీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సూరంపల్లి పరశురాం ప్రశ్నించారు. బుధవారం బిఆర్ఎస్ వి విద్యార్థి నాయకులు  గురుకుల సందర్శన బాట లో భాగంగా హుస్నాబాద్ లోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ బాలికల పాఠశాల, కళాశాలకు బిఆర్ఎస్వి నాయకుల బృందంతో కలిసి సందర్శనకు వెళితే ప్రిన్సిపల్ అనుమతించకుండా కలెక్టర్ పర్మిషన్ ఉంటేనే లోపలికి రానిస్తామని గేటుకు తాళం వేసుకొని వెళ్లారు దీంతో విద్యార్థి సంఘ నాయకులు గేటు ఎదుట ధర్నా నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం గురుకుల పాఠశాలలో సరైన సౌకర్యాలు కల్పించకుండా, పరిశీలనకు వెళ్లిన విద్యార్థి సంఘాలనాయకులను  కక్షపూరితంగా అడ్డుకుంటుందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్వి విద్యార్థి నాయకులు   బొజ్జ హరీష్, పల్లె నవీన్, కందుకూరి సతీష్, మంకాల రమేష్, సైఫుద్దీన్, శేఖర్ బాబు, మహేష్, అజయ్ తదితరులు పాల్గొన్నారు.