– రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై మండిపాటు
– నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి
నవతెలంగాణ-వెల్దుర్తి
తెలంగాణ రైతంగానికి మూడు గంటల కరెంటు సరిపోతుందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ రైతులకు మూడు పంటలు కావాల్నా? మూడు గంటలు కరెంట్ కావాలా? అనే విషయాలపై ఎమ్మెల్యే మదన్ రెడ్డి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. సోమవారం మాసాయిపేట మండల కేంద్రం రైతు వేదికలో ఉచిత కరెంటుపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులను ఉద్దేశించి మాట్లాడారు. రేవంత్ రెడ్డి వాక్యాలు తెలంగాణ రైతాంగాన్ని కించపరిచే విధంగా ఉన్నాయన్నారు. అప్పట్లో కాంగ్రెస్ పార్టీ నేతత్వంలో మూడు గంటల పాటు కరెంటు ఇచ్చేవారని రైతులు తమ బోర్ల వద్ద కరెంటు ఎప్పుడు వస్తుందో తెలియని వైనం ఉండేదన్నారు. అర్ధరాత్రి దొంగ కరెంటు లాగా కరెంట్ వస్తే చాలామంది రైతులు కరెంట్ షాక్‌లో గురై చనిపోవడం జరిగిందని గుర్తు చేశారు. రైతులు పండించిన పంటను కొనేవాళ్ళు లేక దళారుల పాలై మోసపోయారని మరోసారి గుర్తు చేశారు. రైతులు తమ ఎరువుల బస్తాల కొనుగోలు చేయడానికి లైన్లో రోజుల తర్వాత నిలబడి సొమ్మసిల్లి పడిపోయి చనిపోయిన సంఘటనలు ఎన్నో ఉన్నాయని గుర్తు చేశారు. కొద్దిపాటి వర్షం కురిస్తే మూడు నాలుగు రోజుల వరకు కరెంటు కూడా రాని పరిస్థితి ఉండేదన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్లు కరెంటు గురించి మాట్లాడడం రైతులు గమనిస్తున్నారన్నారు. తెలంగాణ రాగానే కేసీఆర్ రైతులకు ఉచిత కరెంటు రైతు బంధు పథకం రైతు బీమా సకాలంలో రైతులకు కొరత లేకుండా అవసరాన్ని బట్టి రైతులకు ఫర్టిలైజర్స్ అందుబాటులో ఉంచడం జరిగిందన్నారు. ప్రతిపక్ష నేతలు ఉన్నటువంటి వరకు చాలా సందర్భాల్లో వడ్ల గురించి ధర్నా చేశారు. కేవలం అది వాళ్ళ సొంత లబ్ధి కోసమేనన్నారు. వర్షం పడి వడ్లు తడిసిన ప్రభుత్వం కొనుగోలు చేయడం జరిగిందన్నారు. తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం లో భూముల విలువ బాగా పెరిగిందన్నారు. దీనికి కారణం కాలేశ్వరం డ్యామ్ వలన వ్యవసాయానికి నీళ్లు రావడం, 24 గంటలు కరెంటు రావడం, పంటలు బాగా పడడం, రైతు శ్రీమంతుడు కావడమేనన్నారు. ప్రతిపక్ష నాయకులు మాట్లాడే ముందు గతాన్ని గుర్తుచేసుకొని మాట్లాడాలన్నారు. రాబోయే ఎన్నికల్లో తెలంగాణ రైతు సంఘం ప్రతిపక్ష నాయకులకు గట్టిగా బుద్ధి చెప్పే తరుణం ఆసన్నమైందన్నారు. బీజేపీకి ఈ ఎన్నికల్లో గుణపాఠం తప్పుదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ స్వరూప నరేందర్ రెడ్డి, జెడ్పిటిసి రమేష్ గౌడ్, స్థానిక సర్పంచి మధుసూదన్ రెడ్డి, గ్రంథాలయ చైర్మన్ చంద్ర గౌడ్ కోఆప్షన్ మన్సూర్, ప్రజా ప్రతినిధులు అధికారులు, అనధికారులు రైతులు ప్రజలు పాల్గొన్నారు.