రోడ్డు ప్రమాద బాధితుడికి అండగా నిలిచిన మనోరమ ఆస్పత్రి వైద్యులు 

– ఇప్పటికైనా ఎవరైనా స్పందిస్తే బాధితుడికి కొండంత అండ 
నవతెలంగాణ కంఠేశ్వర్ : రోడ్డు ప్రమాదంలో కోమా స్టేజ్ కి వెళ్లిన బాధితుడికి నిజామాబాద్ నగరంలోని మనోరమ ఆసుపత్రి వైద్యులు అండగా నిలిచి వైద్యం అందించారు. ప్రస్తుతం ఆ వ్యక్తి పరిస్థితి బాగానే ఉందని కోరుకుంటున్నాడని ఇప్పటికైనా తమ గ్రామస్తులు కుటుంబ సభ్యులు ఎవరైనా స్పందిస్తే బాధితుడికి కొండంత బలం చేకూరి బాగుంటాడని నిజామాబాద్ మనోరమ హాస్పిటల్ న్యూరో సర్జన్ కట్ట నరసింహ తెలిపారు. ఈ మేరకు గురువారం నగరంలోని మనోరమ ఆసుపత్రి ఆవరణంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బాధితునికి సంబంధించిన వివరాలను వెల్లడించారు.
బిచ్కుంద మండలానికి చెదిన బసవరాజు అనే వ్యక్తి కీ చందూరు మండలంలోని బడాపడ్ కు వెళ్లే ప్రాంతంలో రోడ్ యాక్సిడెంట్ జూన్ 14, 2024
అయింది. నిజాంబాద్ జిల్లా కేంద్రంలోని మనోరమ ఆసుపత్రిలో జూన్ 14 న బసవరాజ్ మిత్రులు తీసుకువచ్చి ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు. అప్పటినుండి సుమారు రెండు నెలల వరకు బిచ్కుంద గ్రామస్తులు గ్రామ పెద్దలు, బసవరాజ్ స్నేహితులు అందరూ కలిసి ఎంతో కొంత సహాయం అందించారు, అదేవిధంగా మానవతా దృక్పథంతో తమ ఆసుపత్రిలో అడ్మిట్ అయినప్పటికీ నుంచి చికిత్స ఆసుపత్రి వైద్యులు అందించారు. సుమారు నెలకు పైగా అవుతున్న బసవరాజు వద్దకు ఎవరు రాకపోవడంతో ఆసుపత్రి సిబ్బంది తమ సొంత ఖర్చులతో ప్రతి ఒక్కరి సహకారంతో టాబ్లెట్స్ రక్త పరీక్షలు ప్రతి ఒక్కటి ఆసుపత్రి వైద్యులు నిర్వహించారు. ఇలాంటి సేవాగుణం ఒక మనోరమ ఆసుపత్రికి దక్కుతుంది. కుటుంబ సభ్యులు ఎవరూ లేకపోవడం, తల్లిదండ్రులు లేరు, తమ్ముడు మానసిక రోగి, కావడంతో చాలా ఇబ్బంది పడ్డాడు.
బసవరాజుకు స్నేహితులు మాత్రం ఆర్థిక సహాయం అందించి మొదట్లో చికిత్స అందించారు. తర్వాత వారు కూడా రాకపోవడంతో గత నెలరోజులుగా ఆసుపత్రి యాజమాన్యమే ఉచితంగా చికిత్స అందిస్తున్నారు. బసవరాజు కు చిన్న మెదడులో బ్లడ్ క్లాట్ కావడంతో ప్రస్తుతం కోమలో ఉన్నారు. చికిత్స అందివ్వడం ద్వారా ఇప్పుడు చూడగలుగుతున్నాడు. బంధువులు ఎవరైనా పక్కన ఉండి సపోర్ట్ చేస్తే త్వరలోనే కోలుకునే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. ఆస్పత్రి యజమాన్యమే పూర్తి ఖర్చులు భరిస్తూ సుమారు 6 లక్షల వరకు ఖర్చు చేశారు. ప్రస్తుతం ఆస్పత్రిలోనే ఉంచి చికిత్స మాత్రం అందిస్తున్నారు. అందుకోసం ఆస్పత్రిలో పనిచేస్తున్న సిబ్బంది చేదోడువాదోడుగా బసవరాజుకు అండగా నిలబడుతున్నారు. ఈ విషయమై ఎవరికి ఫోన్ చేసినా ప్రస్తుతం ఎవరు స్పందించడం లేదు. ప్రస్తుతం బసవరాజ్ కోలుకునే స్టేజ్ కి రావడం ఇప్పటికైనా గ్రామ పెద్దలు ఎవరైనా వస్తే బాగుంటుందని ఆసుపత్రి సిబ్బంది ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మనోరమ ఆస్పత్రి పరిధిలోని సంబంధిత పోలీస్ స్టేషన్ లో సమాచారం అందించామన్నారు. మీడియా ముఖంగా తెలియజేసేందుకు ముఖ్య కారణం ఎవరైనా బాధితుడికి హాయం అనగా మనోధైర్యంగా తోడుండి చూసుకుంటే బాగుపడతాడని ఆసుపత్రి వైద్యులు తెలుపుతున్నారు.