
నవతెలంగాణ – మిరుదొడ్డి
ప్రభుత్వ ఆసుపత్రి పేద ప్రజలకు ఎంతగానో మేలుగా ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల ఆరోగ్యం కోసం ఏర్పాటు చేశారు .సిద్దిపేట జిల్లా అక్బర్ పేట భూంపల్లి మండలం భూంపల్లి గ్రామంలోని 24 గంటల వైద్య సదుపాయం ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు లేకపోవడంతో రోగులు తీర ఇబ్బందులకు గురవుతున్నారు. ఆసుపత్రిలో డాక్టర్ లేకపోవడంతో చుట్టుపక్కల ఉన్న వారు డాక్టర్ కోసం వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొన్నది ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్యం అందుతుందని నమ్మకంతో వచ్చిన ప్రజలకు వైద్య సేవలు సక్రమంగా అందకపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు ఉన్నత అధికారులు స్పందించి 24 గంటల వైద్య సేవలు అందించాలని కోరుతున్నారు.