అశ్వారావుపేట (వినాయక పురం) ప్రభుత్వ ప్రాధమిక కేంద్రం సిబ్బంది ఆద్వర్యంలో కలకత్తా లోని జూనియర్ డాక్టర్ పై పాశవిక దాడికి నిరసన శనివారం నిరసన తెలిపారు. ఈ కార్యక్రమం లో డాక్టర్ రాందాస్,డీపీఎంవో మోహన్,హెచ్ ఈవో వెంకటేశ్వర్లు,పీహెచ్ ఎన్ వెంకట లక్ష్మీ,హెచ్ వీ దుర్గ,ఎస్సెన్ ఉషా,హెచ్ ఏ సతీష్,ఫార్మాసిస్ట్ అనిల్,డీఈవో అరుణ లు పాల్గొన్నారు.
ఐఎంఎ ఆద్వర్యంలో..
కలకత్తా లో జూనియర్ వైద్యురాలు పై అత్యంత పాశవికంగా జరిగిన అత్యాచారం,హత్య కు నిరసనగా శనివారం అశ్వారావుపేట లోని వైద్యులు ఐఎంఎ పిలుపు మేరకు ఉదయం 6 గంటల నుంచి ఆదివారం ఉదయం 6 గంటల వరకు వైద్య సేవలు నిలిపివేసారు. అశ్వారావుపేట ప్రవేట్ డాక్టర్లు వైద్య సేవలను నిలిపివేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు బాబురావు,ఆంజనేయులు, భూక్య ప్రసాదరావు,ఉదయ్ జ్యోతి,కోటిరెడ్డి,పూర్ణచంద్రరావు లు పాల్గొన్నారు.