
ఇంటర్మీడియట్ దశలోని అవరోధాలను అధిగమిస్తే, అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటామని విద్యార్థులను ఉద్దేశించి గురువారం మానసిక వైద్యులు రమణ అన్నారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు మానసిక ఆరోగ్య కార్యక్రమాన్ని నిర్వహించారు. మొబైల్ ఫోన్లను సమాచారం కోసమే వినియోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో వైద్యులు సురేష్, ప్రిన్సిపాల్ నారాయణ, ప్రసాద్, రమేష్, చైతన్య, రాజు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.