నవతెలంగాణ – సిరిసిల్ల
జిల్లాలోని పోలీస్ స్టేషన్లలో పలు సందర్భాలలో స్వాధీనం చేసుకున్న వాహనాల యజమానులు సరైన పత్రాలు చూపెట్టి వాహనాలను తీసుకువెళ్లాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో బుధవారం జరిగిన సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో పలు సందర్భాల్లో స్వాధీనం చేసుకున్న వాహనాలను, వివిధ సందర్భలలో సీజ్ చేయబడిన వాహనాలను వాహన యజమానులు 6 నెలలలోపు సరైన పత్రాలు చూపించి వాహనాలను తీసుకు వెళ్లాలని అన్నారు. జిల్లాలోని ఆయా పోలీస్ స్టేషన్లలో పలు సందర్భాల్లో స్వాధీనం చేసుకున్న వాహనాలు,యజమానులు తీసుకోకుండా ఉన్న వాహనాలు,గుర్తు తెలియని వాహనాలను జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ కి తరలించినట్లు తెలిపారు. మొత్తం జిల్లా వ్యాప్తంగా 55(ఆటోలు 09, కార్స్ 02, సుమో 01, బైక్స్ 43) వాహనాలను ఉన్నాయని తెలిపారు.ఆరు నెలల వ్యవధిలో సరైన ధృవ పత్రాలను చూపించి తిరిగి తీసుకోవచ్చని,ఒకవేళ వాహన యజమానులు లేనియెడల వారి కుటుంబ సభ్యులు సరైన పత్రాలు చూపెట్టి తీసుకువెళ్లాలని లేని పక్షంలో ప్రభుత్వ నిబంధనలను అనుసరించి 6 నెలల తరువాత వాహనాలను వేలం వేయడం జరుగుతుందన్నారు. వాహన యజమానులు సంబంధిత పత్రాలతో ఆరు నెలల లోపు తాడూరు పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో సంప్రదించాలని ఇతర సమాచారం కోసం 87126 56428 ,90009 10619 ఫోన్ నంబర్లను సంప్రదించాలని ఎస్పీ వివరించారు.