తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో తొలి అమరుడు దొడ్డి కొమురయ్య

– యువత మహనీయుల పోరాటస్ఫూర్తిని అలవర్చుకోవాలి
– పారతుషకం పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం
నవతెలంగాణ – యాదగిరిగుట్ట రూరల్
తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో తొలి అమరుడు దొడ్డి కొమురయ్య అని ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య అన్నారు. యాదగిరిగుట్ట మండలం సైదాపురం శనివారం, దొడ్డి కొమురయ్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. యాదగిరిగుట్ట క్లస్టర్ రైతు వేదిక, కురుమ సంఘం కమ్యూనిటీ హాల్ లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దొడ్డు కొమురయ్య పోరాట స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకొని రాబోయే తరాలు ముందుకు నడవాలని, ఆ రోజుల్లో భూమికోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాడినటువంటి తొలి అమరుడు దొడ్డి కొమురయ్య విగ్రహావిష్కరణ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది అని అన్నారు. మహనీయుల స్ఫూర్తితో ముందు తరాలకు ఒక పోరాటపటిమ, రాబోయే తరాలకు స్ఫూర్తిదాయకంగా ఉండాలని, మహనీయుల చరిత్ర అందరూ తెలుసుకోవాలని, మహనీయుల బాటలో, మహనీయులు తీసుకున్న నిర్ణయాలు భావితరాలకు ఎంతో ఆదర్శంగా ఉంటాయని, గ్రామ గ్రామాన దొడ్డు కొమురయ్య, చాకలి ఐలమ్మ, డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ ల విగ్రహాలు ఏర్పాటు చేస్తామన్నారు. ఆలేరు ప్రజలు అది పెద్ద మెజారిటీతో గెలిపించి, ఆశీర్వదించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నా అన్నారు. నాకు వచ్చే ప్రతి నెల పారతుషకాన్ని పేద ప్రజల కోసం, పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం ఖర్చు పెడతానని అన్నారు. మొదటి నెల జీతం ఆలేరులోనే ప్రభుత్వ పాఠశాలలో ఆరో తరగతి నుంచి పదవ తరగతి వరకు పరీక్ష ప్యాడ్స్ అందజేశానన్నారు. ప్రతినెల గ్రామంలోని అట్టడుగు వర్గాలకు పారతుషకంలో తొమ్మిది రూపాయలు మినహాయించి మిగతా అన్ని ఖర్చు పెడతానన్నారు. ప్రజలకు సేవ చేయడమే అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. అందరూ రైతులు రైతు వేదికను ఉపయోగించుకోవాలి అని కోరారు. ప్రతి మంగళవారం, శుక్రవారం రైతువేదికలో మీటింగ్ పెట్టుకుని ఏ పంటలు వేస్తే అధిక దిగుబడినిస్తాయో అధికారులతో చర్చించి, నూతన వంగడాలను, ఆధునిక పద్ధతులు నేర్చుకొని అధిక దిగుబడిని పొంది రైతులు సుఖ సంతోషాలతో ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ చీర శ్రీశైలం, జడ్పీటీసీ తోటకూరి అనురాధ, మున్సిపల్ చైర్మన్ ఎరుకల సుధ హేమెంధర్ గౌడ్, సైదాపూరం సర్పంచ్ బీర్ల శంకర్, కో ఆప్షన్ మెంబర్ ఎండి యాకుబ్, కళ్లెం జహంగీర్ గౌడ్, ముక్కెర్ల మల్లేష్ యాదవ్, యాదగిరిగుట్ట ఏ డి ఏ డి. పద్మావతి, ఏ ఓ రాజేష్ కుమార్, ఉపసర్పంచ్ సురేఖ వెంకట్ రెడ్డి, సీస కృష్ణ గౌడ్, భరత్ గౌడ్, వెంకట్ రెడ్డి, శిఖ ఉపేందర్ గౌడ్, గుండ శంకరయ్య, ఎ ఈ ఓ వెంకట్ రావు, వార్డ్ సభ్యులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.