దొడ్డి కొమురయ్య స్పూర్తితో  ఉద్యమించాలి

– సీపీఐ(ఎం) మండల కార్యదర్శి పోతరాజు జహంగీర్
నవతెలంగాణ – తుర్కపల్లి
తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమురయ్య స్పూర్తితో ఉద్యమించాలని సిపిఎం మండల కార్యదర్శి పోతరాజు జహంగీర్ పిలుపునిచ్చారు. దొడ్డి కొమురయ్య వర్ధంతి సందర్భంగా తుర్కపల్లి మండల కేంద్రంలోని సిపిఎం పార్టీ ఆఫీసులో సిఐటియు ఐద్వా సంఘం అధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ సామాన్య గొర్రెల కాపరుల కుటుంబంలో పుట్టిన కొమురయ్య భూమి, భుక్తికోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం జరిగిన మహత్తర పోరాటంలో అమరుడై ఎంతో మందికి దిక్సూచి అయ్యాడు అన్నారు.ఈ కార్యక్రమంలో ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి బట్టుపల్లి అనురాధ సిపిఎం మండల సీనియర్ నాయకులు కొక్కొండ లింగయ్య తలారి మాతయ్య ఆవుల కలమ్మ సిఐటియు మండల కన్వీనర్  తుటి వెంకటేశం సిఐటియు రాఘవేంద్ర ఆటో యూనియన్ నాయకుడు కొమ్ము ఎల్లేష్ కట్కూరి వెంకటేష్ గుండెబోయిన బలరాం వల్లపు కనకరాజు నరసింహులు రాజు శ్రీను తదితరులు పాల్గొన్నారు.