
యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండల కేంద్రంలో తెలంగాణ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమురయ్య విగ్రహాన్ని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ కలసి ఆవిష్కరించారు. దొడ్డి కొమురయ్య విగ్రహం ఆవిష్కరణ తర్వాత పూలదండ వేసి ఘనంగా నివాళులర్పించారు. ముందుగా విగ్రహావిష్కరణకు విచ్చేసిన ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ని,ఎమ్మెల్యే మందుల సామేల్ గారిని డప్పు డోళ్ల తో ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య మాట్లాడుతూ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంకు ఆజ్యం పోసిన వ్యక్తి దొడ్డి కొమరయ్య అని,భూమి,భుక్తికోసం.. వెట్టిచాకిరి విముక్తి కోసం ప్రాణాలర్పించిన మహోన్నత వ్యక్తి దొడ్డి కొమరయ్య అని కీర్తించారు.1927 ఏప్రిల్ 3న జన్మించిన రైతాంగ వీరుడు, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం తొలి యోధుడు దొడ్డి కొమురయ్య అని, భూమి, భుక్తి, వెట్టిచాకిరి విముక్తి కోసం ప్రాణాలర్పించిన మహోన్నత వ్యక్తి దొడ్డి కొమరయ్య అన్నారు.జనగామ జిల్లా దేవరుప్పల మండలం కడివెండి గ్రామంలో యాదవ వంశంలో దొడ్డి కొమురయ్య జన్మించారన్నారు. తెలంగాణ సాయుధ పోరాటం చరిత్ర అని తలుచుకోగానే మొదటగా గుర్తుకు వచ్చే వ్యక్తి దొడ్డి కొమరయ్య గారిని అన్నారు. కురుమ కులానికి చెందిన గొర్రెల కాపరుల కుటుంబములో జన్మించిన కొమురయ్య ఒక మహోన్నత ఉద్యమానికి ఆద్యుడవడం తెలంగాణ ప్రజలకు గర్వకారణం అని తెలుపుతూ దొడ్డి కొమరయ్య ఆశయాలను సాధించాలని కోరారు. కురుమలత ఐక్యంగా ఉంటే రాజ్యాధికారం లభిస్తుందని బీర్ల ఐలయ్య పేర్కొన్నారు.ఒకప్పుడు నిజాం పాలనలో నల్గొండ జిల్లాలో భాగంగా ఉన్న కడివెండిలో పేదలు, సామాన్యుల బతుకులు దారుణంగా ఉండేవని. భూమి, పంట, పశువులు, పారే నీళ్లపైనా ప్రజలకు హక్కులు ఉండాలని దొడ్డి కొమురయ్య గ్రామాల ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చారన్నారు. బానిసత్వాన్ని నిర్మూలించేందుకు గ్రామగ్రామానా సమావేశాలు పెట్టి ప్రజల్ని ఏకం చేశారన్నారు. ఈ కార్యక్రమంలో కురుమ సంఘం నాయకులు, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.