జిడ్డు వదలట్లేదా…?

Don't leave the oil...?వంట నూనె నిల్వ చేసే బాటిల్స్‌ శుభ్రం చేయడం అంత సులువుకాదు. వాటి జిడ్డు అంత త్వరగా తొలగిపోదు. అలాగే ఆయిల్‌ బాటిల్‌ని డిష్‌ సోప్‌తో శుభ్రం చేసినా జిడ్డుగానే అనిపిస్తుం టుంది. ఈ సింపుల్‌ ట్రిక్‌ వాడితే జిడ్డు క్షణాల్లో తొలగిపోతుంది. అందుకు ఏం చేయాలంటే.. ముందుగా ఆయిల్‌ బాటిల్‌ను వేడి నీళ్లలో నానపెట్టాలి. నూనె జిడ్డు చాలా వరకు పోతుంది. నీటి నుండి సీసాలను తీసివేసి, టిష్యూ పేపర్‌తో తుడవాలి. లేదంటే టవల్‌తో కూడా తుడవవచ్చు.
అలాగే సీసాలు లేదా పాత్రలను డిష్‌ సోప్‌తో శుభ్రం చేయవచ్చు. ముందుగా లిక్విడ్‌ సోప్‌, స్క్రబ్బర్‌తో బాగా స్క్రబ్‌ చేయాలి. తర్వాత శుభ్రమైన నీటితో కడగాలి. వెనిగర్‌తోనూ బాటిల్‌లను శుభ్రం చేయవచ్చు. ఒక గిన్నెలో నీరు తీసుకుని, అందులో వెనిగర్‌, నిమ్మరసం కలపాలి. అందులో నూనె సీసాలు, బాటిల్స్‌ వేయాలి. అనంతరం సబ్బుతో కడిగేస్తే సరి.
బేకింగ్‌ సోడాతో బాటిల్‌ను సులువుగా శుభ్రం చేయవచ్చు. బేకింగ్‌ సోడా జిడ్డును తొలగిస్తుంది. వేడి నీటిలో బేకింగ్‌ సోడా కలుపుకోవాలి. అందులో బాటిల్‌లను ముంచి కాసేపు నాననివ్వాలి. ఆ తర్వాత కడిగేస్తే నూనె జిడ్డు తొలగిపోతుంది. వంటగదిలో ఏదైనా పాత్రలు, సీసాలు శుభ్రం చేయడానికి ఈ పద్ధతిని ఉపయోగించవచ్చు. వారానికి ఒకసారి ఈ విధంగా నూనె సీసాలు, మసాలా దినుసుల పాత్రలను శుభ్రం చేయవచ్చు.