ఆర్టీసీ అధికారులకు  ఎన్నికల కోడ్ వర్తించదా?

నవ తెలంగాణ-జక్రాన్ పల్లి:
ఆర్టీసీ అధికారులకు ఎన్నికల కోడ్ వర్తించదా? ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. మంగళవారం బస్సులో గమ్యం యాప్ ఇంతవరకు తొలగించలేదు. గమ్యం యాప్ పోస్టర్లో  మాజీ రాష్ట్ర ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ ఫోటోతో కనిపిస్తుంది. అధికారులు తొలగించే ప్రయత్నం చేశారు. కానీ రాజకీయ నాయకుల ఫోటో అలాగే ఉండిపోయింది. నిజామాబాద్ నుండి బోధన్ వెళ్లే నాన్ స్టాప్ సూపర్ లగ్జరీ బస్సు లో కనిపిస్తుంది.