పిక్క బలం లేని వాడి వెంట కుక్కలు పడితే ఎలా ఉంటుంది. ఎలా ఉంటుందంటే… ఒంటిపై నాలుగు గాయాలు, బొడ్డు చుట్టూ ఐదు సూదులు అన్నట్టుగా ఉంటుంది. ఈ కుక్కల పురాణం ఇప్పుడు దేనికంటే… ఈ మధ్య రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌తోపాటు జిల్లాలు, మండలాలు, గ్రామాల్లో సైతం ఈ గ్రామ సింహాలు హల్ చల్ చేస్తున్నాయి. దొరికిన వాణ్ని దొరికినట్టు కరిచి పారేస్తున్నాయి. వాటికి ఆడ, మగ, చిన్నా, పెద్దా అనే తేడా లేదు. అందరూ సమానమే. ఈ క్రమంలో కుక్కల దవాఖానాలకు జనం క్యూ కడుతున్నారు. సూదులు వేయించుకుంటాం సరే… కానీ ఆ తర్వాత పత్యం చేసుకుంటూ, పనులకు పోకుండా ఉండాలంటే మాకు పూటెలా గడుస్తుంటున్నారు కుక్కల బాధితులు. జంతు ప్రేమికుల గురించి పదే పదే మాట్లాడే అక్కినేని అమల లాంటి వారు దీనిపై స్పందించాలంటూ బాధితులు డిమాండ్ చేశారు. అమలా మేడమ్.. ఒక్కసారి వారి గోస వినండి ప్లీజ్…
-కేఎన్ హరి