నవతెలంగాణ – ఆర్మూర్
పట్టణంలో కుక్కలు, కోతుల బెడద అను వార్తకు శుక్రవారం మున్సిపల్ అధికారులు స్పందించారు. మున్సిపాలిటీలో కుక్కల బెడద తీవ్రమైనట్టు కథనం ప్రచురితమైంది.. ఈ నేపథ్యంలో మున్సిపల్ అధికారులు స్పందించారు. పట్టణంలోని పలుచోట్ల వీధి కుక్కలను పట్టుకొని ఏ బి సి. సెంటర్ కు తరలిస్తున్నామని చెప్పారు. వీధి కుక్కలకు ఎలాంటి హాని కలగకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. కుటుంబ నియంత్రణ ఆపరేషన్ తర్వాత పట్టుకున్న చోటే వీధి కుక్కలను వదిలిపెడతామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.